Wine Shops Close: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. ఎన్ని రోజులంటే?

Wine Shops Close: మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. శ్రీరామనవమి సందర్బంగా హైదరాబాద్‌లో మద్యం షాపులు, బార్‌ల మూసీవేతపై పోలీసు ఉన్నత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాములోరి కళ్యాణంసందర్బంగా మద్యం ప్రియులకు పోలీసులు షాకిచ్చారు. భాగ్యనగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం వైన్స్ షాపులకు ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయించితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, 5 స్టార్ హుటల్స్ లోనూ బార్ రూమ్స్ మూసేయాలని పోలీసులు ఆదేశించారు. శ్రీరామనవమి శోభాయాత్రల సందర్బంగా శాంతి భద్రతా ఏర్పట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సీతరాంబాగ్ లోని ద్రౌపతి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సీతారామ శోభయాత్ర సమన్వయ కమిటీ సమావేశానికి నగర సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీవి ఆనంద్ మాట్లాడుతూ.. శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేపడుతోందని పేర్కొన్నారు. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర హనుమాన్ టేక్డీలో ముగిసేవరకు వందలాదిమంది పోలీసులతో భారీ బందోబస్తును చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నా రు.
అన్ని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు. శోభాయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్‌లకు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. శోభాయాత్రలో విగ్రహాల ప్రతిమల సైజు 20 అడుగుల కంటే ఎక్కువగా పెంచరాదని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా 6 ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఆర్‌ఎఫ్ టీమ్స్ ను కూడా సిద్ధంగా ఉంచుతామన్నారు.