Wine Shops Close: మందుబాబులూ మీకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు వైన్ షాపుల బంద్

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 04:40 PM

Wine Shops Close: మందుబాబులూ మీకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు వైన్ షాపుల బంద్

Wine Shops Close: మందుబాబులకు తెలంగాణ సర్కార్ బాడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. హోలీ పండుగ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

ఈ నేపథ్యంలో జంట నగరాల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు మూసీ వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర పీఎస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు హైదరాబాద్, సికింద్రాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది.

మద్యం దుకాణాల బంద్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై కూడా నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, గుంపులు గుంపులు తిరుగుతూ.. న్యూసెన్స్ చేయవద్దని సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

సోమవారం సాయంత్రం 06 గంటల నుంచి బుధవారం ఉదయం 06 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. కాగా, రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయన్న వార్త, అసలే ఆదివారం కావడంతో మద్యం ప్రియులు వైన్స్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో వైన్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం సాయంత్రం వరకూ వైన్ షాపుల వద్ద ఇదే రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.