BRS Party: తుమ్మల VS రేగా.. ఇంటి పోరు బట్టబయలైంది!

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 09:30 AM

BRS Party: తుమ్మల VS రేగా.. ఇంటి పోరు బట్టబయలైంది!

BRS Party: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ స్థాయిలో జెండా పాతాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు మొదలు పెట్టిన గులాబీ బాస్ ప్రతి అడుగు ఆచితూచి పగడ్బంధీగా వేస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఒకవైపు జాతీయ స్థాయి రాజకీయాలపై ఫోకస్ చేస్తుంటే.. ఇక్కడ రాష్ట్రంలో తమ్ముళ్లు మాత్రం ఇంటి పోరులో కత్తులు దూస్తున్నారు. బహిరంగంగానే మాటల దాడికి దిగుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు వివాదాలు రాజకీయ మెరిగిన సత్యం. పార్టీ అధిష్టానం మీద భయమో.. రాజకీయ మర్యాదో ఈ అంతర్గత పోరులో ఇప్పటి వరకు బహిరంగ వ్యాఖ్యలు లేవు. సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు.. ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ప్రస్తుత ప్రభుత్వ విప్ రేగా కాంతరావు ఇలా చాలామంది ఉండగా.. ఇందులో రెండు గ్రూపులుగా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయని టాక్ కూడా నడుస్తుంది.

ఈ మధ్యనే కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ రాజకీయాలలో హాట్ టాపిక్ గా నిలిచాయి. మంత్రి పువ్వాడ, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి ఎవరికి వారు శిబిరాలను నిర్వహించి కొత్త ఏడాది సంబరాలు జరుపుకున్నారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు బహిరంగంగానే మాజీ మంత్రి తుమ్మల మీద విమర్శల కౌంటర్లు వేశారు. పనికిరాని రానోడని ప్రజలు పక్కన పెడితే.. ఈయన తెచ్చిన పనులు నేను ఇంకా ప్రారంభిస్తున్నానట.. వంద పడకల హాస్పిటల్ కి వెళ్లి మాట్లాడు అదే డైలాగు అంటూ ఘాటు వ్యాఖ్యలకు దిగారు.

నీ తెలివి తక్కువ తనానికి ప్రజలు డీఎంఎఫ్టీ ఫండ్స్ వంద కోట్లు నష్టపొగా.. రిటన్ నేను 100 కోట్లు ఎస్డీఎఫ్ ఫండ్స్ తెచ్చా అది నా దమ్ము అంటూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. గోదావరి నది మీద చిన్నరావిగూడెం నుండి పర్ణశాల బ్రిడ్జి నిధులు ఎటు పోయాయో కూడా సోయి లేనిడివో.. నువ్వు నిధులు తెస్తే నేను ప్రారంభించుడా.. వారెవ్వా ప్రజలకు అన్ని తెలుసు అన్నారు. పినపాక ప్రజల మీద ప్రేమతో తుమ్మల ఆ మాత్రం పనులు చేపించక పోతే అంధకారమే మిగిలేది మనకు అంటూ రేగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రేగా వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.