Sushmitha Konidela : అందుకే రామ్ చరణ్ కి బాబు పుట్టాలి.. అక్క సుస్మిత కొణిదెల వ్యాఖ్యలు..

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఈ సారి సంక్రాంతి మరింత గ్రాండ్ గా, సంతోషంగా జరుపుకుంటున్నాం. ఉపాసన ప్రెగ్నెంట్ కావడం, చరణ్ తండ్రి కాబోతుండటం అందరికి ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి.....................

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 06:11 PM

Sushmitha Konidela : అందుకే రామ్ చరణ్ కి బాబు పుట్టాలి.. అక్క సుస్మిత కొణిదెల వ్యాఖ్యలు..

Sushmitha Konidela :  చిరంజీవి కూతురుగా సుస్మిత కొణిదెల ఫేమ్ తెచ్చుకున్నా సినీ పరిశ్రమలో ఫ్యాషన్ డిజైనర్ గా, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తూనే ఇటీవల చిరంజీవి అన్ని సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది సుస్మిత. అలాగే ఓ పక్క కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే మరోపక్క తన భర్తతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుంది.

ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా సుస్మిత కాస్తూమ్ డిజైనర్ గా పనిచేసింది. తాజాగా సుస్మిత కొణిదెల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన తాము తల్లితండ్రులు కాబోతున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్ళైన పదేళ్ల తర్వాత మొదటిసారి ఉపాసన ప్రగ్నెంట్ అవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుస్మిత మాట్లాడింది.

RRR : ఎన్టీఆర్ ఆ సమయంలో చాలా కష్టపడ్డాడు.. రామ్‌చరణ్!

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఈ సారి సంక్రాంతి మరింత గ్రాండ్ గా, సంతోషంగా జరుపుకుంటున్నాం. ఉపాసన ప్రెగ్నెంట్ కావడం, చరణ్ తండ్రి కాబోతుండటం అందరికి ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసనది డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి అన్ని ఆహార, ఆరోగ్య నియమాలని కచ్చితంగా పాటిస్తూ హెల్తీగా ఉంది. ఇక చరణ్ కి ఎవరు పుట్టినా పర్లేదు. బాబు, పాప అయినా పర్లేదు కానీ అబ్బాయి పుడితే బాగుండు అనుకుంటున్నాము. ఎందుకంటే నాకు, శ్రీజకి ఆడపిల్లలే. ఇంట్లో గర్ల్ పవర్ ఎక్కువ. ఇల్లంతా అమ్మాయిలతో సందడిగా ఉంటుంది. ఒక అబ్బాయి ఉంటే బాగుండు అందుకే బాబు పుడితే బాగుంటది అని అనుకుంటున్నాను. కానీ ఎవరు పుట్టినా మాకు ఓకే అని తెలిపింది.