RRR : ఎన్టీఆర్ ఆ సమయంలో చాలా కష్టపడ్డాడు.. రామ్‌చరణ్!

రాజమౌళి అండ్ టీం ప్రస్తుతం అమెరికాలోని పలు మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూలు వస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ షూటింగ్ సమయంలోని సంఘటనలు గురించి చెప్పుకొచ్చాడు

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 05:09 PM

RRR : ఎన్టీఆర్ ఆ సమయంలో చాలా కష్టపడ్డాడు.. రామ్‌చరణ్!

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. RRR సృష్టించిన మానియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలి అంటే భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ అవార్డుల రేస్ లో నిలవడమే కాకుండా ఇంటర్నేషనల్ మూవీస్ ని వెనక్కి నెట్టి అవార్డుల్ని సైతం కైవసం చేసుకుంటుంది.

RRR : ఆస్కార్‌కి ‘RRR’ని భారత్ ప్రభుత్వం ఎంపిక చేయకపోవడం పై స్పందించిన ఎన్టీఆర్..

తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’ పాటు బెస్ట్ సాంగ్‌ అవార్డుని అందుకుంది. ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన పురస్కారం కావడంతో చిత్ర యూనిట్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ షూటింగ్ సమయంలోని సంఘటనలు గురించి చెప్పుకొచ్చాడు.

సినిమాలో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీన్ అందరికి గుర్తు ఉండే ఉంటది. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ని జైలు నుంచి తప్పించి తీసుకు వెళ్తుంటాడు. ఈ ఫైట్ సీక్వెన్స్ ని సుమారు 15 రాత్రులు పాటు చిత్రీకరించినట్లు వెల్లడించాడు చరణ్. ఇక ఫైట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ భుజాలు కూర్చొని ఫైట్ చేస్తూ ఉంటాడు. దీని గురించి చరణ్ మాట్లాడుతూ.. ‘ఆ సీన్ దాదాపు రెండు వారలు జరిగింది. ప్రతి రోజు తారక్ నన్ను తన భుజాలు పై మోశాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం తారక్ చాలా కష్ట పడ్డాడు’ అంటూ వెల్లడించాడు. అలాగే నిజంగా పులితో ఫైట్ చేయాల్సి వస్తే ఎవరు ఎక్కువ టైం ఫైట్ చేస్తారు అంటూ అడిగిన విలేకరి ప్రశ్నకి బదులిస్తూ.. అలాంటి పరిస్థితి వస్తే ఇద్దరం పారిపోతాం అంటూ తెలియజేశారు.