RRR : ఆ టైంలో రోజులో 7 సార్లు భోజనం చేసేవాడిని.. ఎన్టీఆర్!

ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చరణ్, ఎన్టీఆర్ లు సినిమాకి సంబంధించిన పలు ఆశక్తికర విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సమయంలో తన డైట్ గురించి మాట్లాడాడు.

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 05:35 PM

RRR : ఆ టైంలో రోజులో 7 సార్లు భోజనం చేసేవాడిని.. ఎన్టీఆర్!

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. RRR సృష్టించిన మానియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలి అంటే భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ అవార్డుల రేస్ లో నిలవడమే కాకుండా ఇంటర్నేషనల్ మూవీస్ ని వెనక్కి నెట్టి అవార్డుల్ని సైతం కైవసం చేసుకుంటుంది.

RRR : ఎన్టీఆర్ ఆ సమయంలో చాలా కష్టపడ్డాడు.. రామ్‌చరణ్!

తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’ పాటు బెస్ట్ సాంగ్‌ అవార్డుని అందుకుంది. ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన పురస్కారం కావడంతో చిత్ర యూనిట్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చరణ్, ఎన్టీఆర్ లు సినిమాకి సంబంధించిన పలు ఆశక్తికర విషయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సమయంలో తన డైట్ గురించి మాట్లాడాడు. “ఈ మూవీ కోసం ఫిట్‌నెస్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాము. సినిమా మొత్తం ఒకటే ఫిజిక్ మెయిన్‌టైన్ చేస్తూ వచ్చాము. అందుకు కోసం నేను ప్రత్యేక డైట్ పాటించాల్సి వచ్చింది. రోజుకి సుమారు 3000 కేలరీలు పెంచుకోడానికి.. దాదాపు రోజులో 7 సార్లు భోజనం చేసేవాడిని. సినిమాలో మీరు చూస్తున్న లుక్ లోకి రావడానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టింది” అంటూ తెలియజేశాడు. అలాగే సినిమాలోనే ట్రైన్ బ్రిడ్జి యాక్సిడెంట్ సీన్ ని.. మూవీ షూటింగ్ మొదలైన మూడో రోజునే చిత్రీకరించినట్లు, 2018లో షూట్ చేసిన ఆ సీక్వెన్స్ 12 రోజులు పాటు చేసినట్లు తెలియజేశాడు.