RRR : ఆస్కార్‌కి ‘RRR’ని భారత్ ప్రభుత్వం ఎంపిక చేయకపోవడం పై స్పందించిన ఎన్టీఆర్..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. భారత్ ప్రభుత్వం 'RRR'ని ఆస్కార్‌కి ఎంపిక చేయకపోవడం గురించి మాట్లాడాడు.

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 04:44 PM

RRR : ఆస్కార్‌కి ‘RRR’ని భారత్ ప్రభుత్వం ఎంపిక చేయకపోవడం పై స్పందించిన ఎన్టీఆర్..

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. RRR సృష్టించిన మానియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలి అంటే భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ అవార్డుల రేస్ లో నిలవడమే కాకుండా ఇంటర్నేషనల్ మూవీస్ ని వెనక్కి నెట్టి అవార్డుల్ని సైతం కైవసం చేసుకుంటుంది.

NTR : కనురెప్పతో కూడా పెర్ఫార్మన్స్ చేయగల నటుడు ఎన్టీఆర్.. లాస్ ఏంజెల్స్ వేదికపై రాజమౌళి!

తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’ పాటు బెస్ట్ సాంగ్‌ అవార్డుని అందుకుంది. ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన పురస్కారం కావడంతో చిత్ర యూనిట్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. భారత్ ప్రభుత్వం ‘RRR’ని ఆస్కార్‌కి ఎంపిక చేయకపోవడం గురించి మాట్లాడాడు.

భారత్ తరుపు నుంచి ఆస్కార్‌కి ఆర్ఆర్ఆర్ ని ఎంపిక చేయకపోవడంలో ఏమన్నా రాజకీయం జరిగిందా? అని విలేకరి ప్రశ్నించాడు. దీనికి తారక్ బదులిస్తూ.. భారత్ ప్రభుత్వం RRRని ఆస్కార్‌కి ఎందుకు ఎంపిక చేయలేదు అనే దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మమల్ని చాలా గర్వపడేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, సినీ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి ఆస్కార్ రావాలి అని కోరుకుంటున్నారు. అంతకన్నా ఏమి కావాలి.

ఇక అధికార ఎంపిక విషయంలో రాజకీయం జరిగిందా? లేదా? అనేది నాకు తెలియదు. కానీ సెలక్షన్ ప్యానల్ లో ఉన్న జ్యూరీ మెంబెర్స్ ఉన్నతంగా అలోచించి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. వాళ్లకి ఏ సినిమా ఎంపిక చేసుకోవాలి అనేది తెలుసు ఉంటుంది అంటూ వెల్లడించాడు.