RRR : చరణ్ నీరు లాంటి వాడు.. ఎన్టీఆర్!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి గొప్పగా ప్రశంసించాడు.

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 06:07 PM

RRR : చరణ్ నీరు లాంటి వాడు.. ఎన్టీఆర్!

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. RRR సృష్టించిన మానియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలి అంటే భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో ఈ సినిమాకు విశేషమైన ప్రజాధారణ పొందుతుంది. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ అవార్డుల రేస్ లో నిలవడమే కాకుండా ఇంటర్నేషనల్ మూవీస్ ని వెనక్కి నెట్టి అవార్డుల్ని సైతం కైవసం చేసుకుంటుంది.

RRR : ఆస్కార్‌కి ‘RRR’ని భారత్ ప్రభుత్వం ఎంపిక చేయకపోవడం పై స్పందించిన ఎన్టీఆర్..

తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’ పాటు బెస్ట్ సాంగ్‌ అవార్డుని అందుకుంది. ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన పురస్కారం కావడంతో చిత్ర యూనిట్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వ్యక్తిత్వం గురించి గొప్పగా ప్రశంసించాడు.

‘చరణ్ తో నేను చాలా ఏళ్లుగా ప్రయాణిస్తూ వస్తున్నా. ఇన్నాళ్ల నా పరిచయంలో నేను చరణ్ ని నీటితో పోలుస్తాను. సముద్రం లోపలికి వెళ్లే కొద్దీ లోతు తెలుస్తుంది. లోపల ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే మనం ఎంత లోతుకి వెళ్తే అంత తెలుస్తుంది. తనతో ఇంకా ప్రయాణించి తనని ఇంకా బాగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ తెలియజేశాడు. అలాగే చరణ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘తారక్ లోపల ఏది దాచుకోడు. లోపల ఏముందో బయటకి అదే కనిపిస్తుంది’ అంటూ సింపుల్ గా చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.