Viveka Murder Case: అవినాషే మూలకారణం.. ఇంప్లిమెంట్ పిటిషన్‌లో సునీతా రెడ్డి సంచలన విషయాలు!

Kaburulu

Kaburulu Desk

March 13, 2023 | 05:44 PM

Viveka Murder Case: అవినాషే మూలకారణం.. ఇంప్లిమెంట్ పిటిషన్‌లో సునీతా రెడ్డి సంచలన విషయాలు!

Viveka Murder Case: సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సినిమాలను మించేలా తీవ్ర ఉత్కంఠగా సాగుతుంది. ఇప్పటికే మూడు సార్లు ఎంపీ వైఎస్ అవినాష్ ను సీబీఐ విచారించగా మొన్న చివరిసారి విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా రెండో పెళ్లి ఎపిసోడ్ ను అవినాష్ తీసుకొచ్చారు.

అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను శుక్రవారం నాడు దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి పిటిషన్ లో తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వాదనలను కూడా వినాలని ఆ పిటిషన్ లో ఆమె కోరారు.

సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని.. సునీల్ యాదవ్ గూగుల్ టెకౌట్ లొకేషన్ ఆధారంగా హత్యకు ముందు అవినాష్ ఇంట్లో ఉన్నాడని.. అవినాష్ రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ పలుమార్లు వెళ్ళాడని.. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలలో వివేకాని కావాలనే ఓడించి.. 2019 ఎంపీ ఎలక్షన్స్ లో వివేకాకు టికెట్ ఇస్తున్నారనే సమాచారంతో హత్య చేసారని పేర్కొన్నారు.

హత్య గురించి అవినాష్ రెడ్డికి ముందే తెలుసని ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు. హత్య చేశాక అందరిని అవినాష్ కాపాడుకుంటాడాని ఎర్ర గంగిరెడ్డి మిగిలిన నిందితులకు చెప్పాడని.. వివేకా మరణ వార్తను మూడో వ్యక్తి ద్వారా అవినాష్ కు సమాచారం ఇవ్వగా.. విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి 2 నిమిషాల్లోనే వివేక ఇంటికి వెళ్లి.. వివేకా ఇంటికి వచ్చిన శశికళకి, పోలీసులకి, మీడియాకి గుండెపోటుతో చనిపోయినట్లు అవినాష్ సమాచారమిచాడని వెల్లడించారు. హత్య నేరం ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ గంగాధర్ కి ఆఫర్ ఇచ్చాడని.. గంగాధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చాడని గుర్తుచేసింది.