Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్.. ఎంపీ అవినాష్ పిటిషన్లపై రేపు తీర్పు!

Kaburulu

Kaburulu Desk

March 17, 2023 | 08:52 AM

Viveka Murder Case: వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్.. ఎంపీ అవినాష్ పిటిషన్లపై రేపు తీర్పు!

Viveka Murder Case: మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సోదరుడు, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగవంతం చేయగా.. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారగా.. సీబీఐ దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించనున్నారు. అయితే, దీనిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.

సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తున్న కృష్ణారెడ్డి.. డ్రైవర్ దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు సవాల్ చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డికి పిటిషన్ వేసే అర్హత లేదని హైకోర్టుకు తెలిపింది. అనంతరం, కృష్ణారెడ్డి పిటిషన్ పై వాదనలను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, ఇదే హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ చేయకుండా మధ్యంతర పిటిషన్లపై రేపు తీర్పు వెలువడనుంది. తనపై సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా నిలువరించాలని అవినాశ్ పిటిషన్ దాఖలు చేయగా, తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. విచారణపై కూడా స్టే ఇవ్వాలని అవినాష్ కిందటి దర్యాప్తు సమయంలోనే కోర్టును కోరగా హైకోర్టు దాన్ని తిరస్కరించగా.. అరెస్ట్ పై మాత్రం స్టే కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో రేపు తీర్పు ఎలా ఉండనుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు వివేకా ఏపీ కృష్ణారెడ్డి పిటిషన్ కూడా సోమవారమే విచారణకు రానుండడంతో మరింత ఆసక్తిగా మారింది. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఎంపీ అవినాష్ తదుపరి విచారణ, అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలన్న అవినాశ్ అభ్యర్థనపైనా హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది.