Custody Teaser : నిజం… నా కస్టడీలో.. నాగచైతన్య మాస్ యాక్షన్ ‘కస్టడీ’ సినిమా టీజర్ రిలీజ్..

తాజాగా కస్టడీ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎప్పుడు, ఎటునుంచి, ఎలా వస్తుందో నాకు తెలీదు..................

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 11:18 PM

Custody Teaser : నిజం… నా కస్టడీలో.. నాగచైతన్య మాస్ యాక్షన్ ‘కస్టడీ’ సినిమా టీజర్ రిలీజ్..

Custody Teaser :  నాగ చైతన్య, కృతి శెట్టి కాంబోలో రాబోతున్న రెండో సినిమా కస్టడీ. చాలారోజుల తర్వాత నాగచైతన్య మరోసారి ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కస్టడీ సినిమాలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియామణి.. ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా అంది ఈ సినిమా.

తాజాగా కస్టడీ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎప్పుడు, ఎటునుంచి, ఎలా వస్తుందో నాకు తెలీదు.. అంటూ సీరియస్ గా మొదలైంది టీజర్. నాగచైతన్య యక్ష సీన్స్ చూపించారు. పోలీస్ కానిస్టేబుల్ గా విలన్స్ తో తలపడనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 90వ దశకంలో కథతో చూపించబోతున్నట్టు టీజర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.

Roshan : యాంకర్ సుమ తనయుడు హీరోగా ఎంట్రీ.. రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ తో

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న కస్టడీ సినిమా చిత్ర యూనిట్ త్వరలో ప్రమోషన్స్ ని మొదలుపెట్టనున్నారు. సమ్మర్ కానుకగా మే 12న తెలుగు, తమిళ్ లో కస్టడీ సినిమా రిలీజ్ కాబోతుంది.