Khammam Meeting: ప్రగతి భవన్‌లో హడావుడి.. యాదాద్రి టూ ఖమ్మం నలుగురు సీఎంలు

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 12:30 PM

Khammam Meeting: ప్రగతి భవన్‌లో హడావుడి.. యాదాద్రి టూ ఖమ్మం నలుగురు సీఎంలు

Khammam Meeting: భాగ్యనగరంలో జాతీయస్థాయి నేతలతో హడావుడిగా మారింది. జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తొలిసారిగా భారీ బహిరంగసభను తలపెట్టింది. ఖమ్మంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఈ సభకు ఏర్పాట్లు జరగగా.. ఈ సభ కోసం నలుగురు ముఖ్యమంత్రులు.. మరికొందరు జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. సభకు అత్యాధునిక టెక్నాలజీతో భారీ ఏర్పాట్లు చేయగా సభ కోసం వచ్చిన నేతలకు ప్రగతి భవన్ లో ఘనస్వాగతం లభించింది.

బహిరంగసభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్
కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సభ కోసం హైదరాబాద్ వచ్చారు. వీరికి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేయగా.. విందు అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి బయలుదేరి వెళ్లారు.

అయితే, అయితే కేరళ సీఎం పినరయి విజయన్, సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దైవ దర్శనానికి వెళ్లలేదు. గెస్ట్ హౌస్ లోనే ఉండిపోగా.. కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్ దైవదర్శనానికి వెళ్లారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతరం అక్కడి నుంచి ఖమ్మం బయల్దేరి వెళ్లారు. ఈ సభకి ఆహ్వానం అందిన వారిలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పాదయాత్రలో ఉండడంతో హాజరుకాకపోగా.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఇక.. తమిళనాడు నుండి వీసీకే పార్టీ బీఆర్ఎస్ తో విలీనానికి ముందుకు రాగా.. ఈ సభ నుండి ఈ విలీన ప్రకటన వచ్చే అవకాశముంది. సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతో పాటు పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వా డ అజయ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు సభా వేదికపై ఆసీనులు కానున్నారు.