Kesineni Chinni: నానీ వ్యాఖ్యలకి సోదరుడు చిన్ని కౌంటర్స్.. హీట్ రాజేస్తున్న బెజవాడ పాలిటిక్స్!

Kaburulu

Kaburulu Desk

January 18, 2023 | 11:49 AM

Kesineni Chinni: నానీ వ్యాఖ్యలకి సోదరుడు చిన్ని కౌంటర్స్.. హీట్ రాజేస్తున్న బెజవాడ పాలిటిక్స్!

Kesineni Chinni: ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు అగ్గి రేజేస్తున్నాయి. ఒకవైపు రానున్న ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో.. ఎవరు ఎవరితో జత కలుస్తారో ఆసక్తి పుట్టిస్తుండగా.. ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గతంగా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు మరింత ఆసక్తిగా మార్చేస్తున్నాయి. బెజవాడ రాజకీయాలంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ఈ అంతర్గత రాజకీయాలు కాకరేపుతున్నాయి.

టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానీ ఈ మధ్య కాలంలో హీట్ పుట్టించే కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ నానీ.. చంద్రబాబు సీటు ఇవ్వకున్నా ఏమీ కాదని, ట్రస్టులు తెచ్చి గ్రామాలను దత్తత తీసుకుని సేవ చేస్తానని తెలిపారు. ప్రజలు పోటీ చేయమంటే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి సీటు కేటాయించాలి అనే విషయంలోనూ హాట్‌ కామెంట్లు చేశారు.. వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లో కేశినేని చిన్నితో పాటు మరో ముగ్గురిని మినహాయించి టీడీపీ తరపున పోటీ చేసే ఏ అభ్యర్థికైనా తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజాసేవకు ముందుకు వస్తారని, దానకర్ణుడిగా పోజులిస్తున్నాడంటూ నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.

అన్న నానీ కామెంట్లపై స్పందించిన చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను.. నా కాంపౌండ్‌లోకి ఏ అవినీతిపరుడినీ రానివ్వను.. అలాంటి వారి నుంచి దూరం పాటిస్తున్నానని అన్నారు. ఇక, పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారికి సహకరిస్తానని ప్రకటించిన చిన్ని.. అధిష్టానం కేశినేని నానికి టికెట్‌ ఇచ్చినా నా మద్దతు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని చేసిన కామెంట్లను నేను పట్టించుకోనని కొట్టిపారేసిన చిన్ని పార్టీ బలోపేతం కోసం పని చేయడం.. పేదలకు సేవ చేయడమే నాకు తెలుసని స్పష్టం చేశారు.