Kesineni Nani: కేశినేని సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ!

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 09:15 PM

Kesineni Nani: కేశినేని సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ!

Kesineni Nani: టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నానీ ఈ మధ్య కాలంలో హీట్ పుట్టించే కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్న కేశినేని.. కొందరి నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. సొంత సోదరుడితో మొదలైన విబేధాలు పార్టీ అధిష్టానాన్ని కూడా లెక్కచేయని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీ అధిష్టానంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నానీ.. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు మాత్రం చేపట్టడం లేదు.

సొంత పార్టీ నేతలపై నిత్యం విమర్శలు చేస్తున్న నానీ.. ఇతర పార్టీలలో చేరే ఉద్దేశ్యం లేదు కదా.. ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూ భారీ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. కానీ.. జిల్లాలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సీటు ఇవ్వకున్నా ఏమీ కాదని, ట్రస్టులు తెచ్చి గ్రామాలను దత్తత తీసుకుని సేవ చేస్తానని తెలిపారు. ప్రజలు పోటీ చేయమంటే ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని వ్యాఖ్యానించారు.

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎవరు చెప్పారని .. తాను అలా అన్న ఒక్క వీడియోను చూపించాలని సవాల్ చేశారు. నేను మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. బెజవాడలో పనులు ఏమైనా ఆగాయా? దటీజ్ కేశినేని నాని.. అర్ధం చేసుకోండి.. తన పర్సనాలిటీని తగ్గించాలని చూడకండి.. మీరు ఎంత తగ్గించాలని చూస్తే నా పర్సనాలిటీ అంత పెరుగుతుంది.. ఈ విషయం గుర్తుంచుకోండి అంటూ కేశినేని నాని హెచ్చరించారు.

నిజానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ఆయనే చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రివర్స్ అవుతున్నారు. టీడీపీలో ప్రక్షాళన జరగాలని.. తనకు ఇష్టం లేని వాళ్లకు టిక్కెట్లు ఇస్తే పని చేయనని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో.. పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.