Pawan Kalyan : మొదలైన పవన్ కొత్త సినిమా.. మామ అల్లుడల ముల్టీస్టార్ర్ర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా 'వినోదయ సిత్తం' మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు..

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 10:40 AM

Pawan Kalyan : మొదలైన పవన్ కొత్త సినిమా.. మామ అల్లుడల ముల్టీస్టార్ర్ర్..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణలో ఉన్నాడు. ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ఆ తరువాత సాహూ ఫేమ్ సుజిత్ ‘The OG’ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటితో పాటు మరో మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ‘వినోదయ సిత్తం’ మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారికంగా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ ఎక్కడ కనిపించ లేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే ఒక సందేహం నెలకుంది అందరిలో.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఏమి చెప్పాడో తెలుసా?

తాజాగా ఈ సందేహాలు అన్నిటికి చెక్ పెడుతూ ఈ మూవీని అధికారికంగా ప్రారభించారు. కార్తికేయ-2, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ మొదలయింది అంటూ నిర్మాతలు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తెలుగులో కూడా ఈ సినిమాని సముద్రఖనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మధ్యతరగతి సంబంధించిన వ్యక్తి (హీరో) యాక్సిడెంట్ లో చనిపోతాడు. చనిపోయిన తనని తీసుకు వెళ్ళడానికి టైం అనే ఒక వ్యక్తి వస్తాడు. అయితే అతను చేయవల్సిన పనులు కొన్ని ఉంటాయి. అందుకోసం తనకి కొంత సమయం కావాలి, కాబట్టి తనని బ్రతికించమని హీరో, టైంని కోరతాడు. దీంతో టైం, హీరోకి కొంత సమయం ఇస్తాడు, ఆ సమయంలో హీరోతో పాటు టైం కూడా తనతో పాటు ట్రావెల్ అవుతాడు.

ఈ టైం పాత్రలోనే పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. హీరో పాత్రలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు. పవన్ పాత్ర కేవలం ఒక హాఫ్ మాత్రమే ఉంటుంది. గతంలో పవన్ ఈ తరహా పాత్ర గోపాల గోపాల మూవీలో చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కోసం, అది తన అల్లుడితో కలిసి నటిస్తుండడంతో మెగా అభిమానుల్లో ఈ మూవీ పై చాలా ఆసక్తి నెలకుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాము అంటూ నిర్మాతలు తెలియజేశారు.