Spice Box : వంటిల్లే ఆరోగ్యం.. పోపులపెట్టెలో ఉండేవాటిల్లో ఎన్ని పోషకాలున్నాయో మీకు తెలుసా?

 ఆరోగ్యం బాగుండాలని రకకాల ఆహారపదార్థాలను తినాలని అనుకుంటారు. వాటిని డైట్ లో చేర్చుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న పోషకపదార్థాల గురించి మనం తెలుసుకోవాలి. మన వంటింట్లో ఉండే చాలా పదార్థాలు.............

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 09:50 AM

Spice Box : వంటిల్లే ఆరోగ్యం.. పోపులపెట్టెలో ఉండేవాటిల్లో ఎన్ని పోషకాలున్నాయో మీకు తెలుసా?

Spice Box :  ఆరోగ్యం బాగుండాలని రకకాల ఆహారపదార్థాలను తినాలని అనుకుంటారు. వాటిని డైట్ లో చేర్చుకుంటారు. కానీ మన దగ్గర ఉన్న పోషకపదార్థాల గురించి మనం తెలుసుకోవాలి. మన వంటింట్లో ఉండే చాలా పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా మన పోపులపెట్టెలో ఉండే పదార్థాలు కూడా మనకు మంచి చేస్తాయి.

ధనియాలు, జీలకర్ర వంటివి మన శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి. యాంటి ఆక్సిడెంట్స్, ఐరన్ ఎక్కువగా ఉండే ధనియాలు, జీలకర్ర వాడడం వలన మన శరీరానికి కూడా ఆ పోషకాలు అందుతాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అజీర్తి, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటివి తగ్గుతాయి. జీలకర్ర రోజూ తినడం వలన బాలింతలలో తల్లిపాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే జీలకర్ర మన ఆయుష్షు కూడా పెంచుతుందని అంటారు.

ఆవాలు మన శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గేలా చేస్తాయి. ఆవాలలో ఉండే మెగ్నీషియం నరాల వ్యవస్థను మెరుగుపరిచి ఒత్తిడి, ఆందోళనలు తగ్గేలా చేస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం మన శరీరంలో దంతాలు, ఎముకలు, శిరోజాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మిరియాలు అనేవి మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన జలుబు, దగ్గు, జ్వరం అనేవి తొందరగా రాకుండా ఉంటాయి.

ఇంగువలో ఉండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఇంగువ అనేది ఆస్తమా ఉన్నవారికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇంగువ వలన త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటివి కూడా తగ్గుతాయి. మెంతులు మన శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. శిరోజాలు ఆరోగ్యంగా ఉండడానికి, శిరోజాలు తొందరగా పెరగడానికి, నల్లగా ఉండడానికి మెంతులు ఉపయోగపడతాయి. మెంతులు తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.

Flower Vase : ఫ్లవర్ వాజ్ లో ఉంచే పువ్వులు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఎండుమిర్చిలో ఉండే పొటాషియం మన శరీరంలో రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎండుమిర్చిలో ఉండే యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఇక పసుపు జలుబు, దగ్గు.. లాంటివి రానీయకుండా చేసి మన రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి తాలింపుల పెట్టెలో, మన వంటింట్లో ఉండేవి అన్ని మనకు పోషకాలను అందజేసేవే. చాలామంది వీటిని సరిగ్గా వాడుకోరు. కొంతమంది ఇవి వంటల్లో వస్తే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి వీటిని అలా తీసెయ్యకుండా రెగ్యులర్ గా వాడుకొని మన ఆరోగ్యాన్ని ధృడంగా ఉంచుకోవచ్చు. అందుకే పెద్దోళ్ళు ఊరికే అనలేదు వంటిల్లే ఆరోగ్యం అని.