Dalda History : నెయ్యికి బదులు మనం వాడే డాల్డా చరిత్ర తెలుసా మీకు?

డాల్డాను మనం ఇప్పుడు నెయ్యికి బదులుగా వాడుతున్నాము ఎందుకంటే అది నెయ్యి కంటే రేటు తక్కువ కాబట్టి. కానీ అసలు మన భారతదేశానికి డాల్డా అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా?.................

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 10:50 AM

Dalda History : నెయ్యికి బదులు మనం వాడే డాల్డా చరిత్ర తెలుసా మీకు?

Dalda History :  డాల్డాను మనం ఇప్పుడు నెయ్యికి బదులుగా వాడుతున్నాము ఎందుకంటే అది నెయ్యి కంటే రేటు తక్కువ కాబట్టి. కానీ అసలు మన భారతదేశానికి డాల్డా అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా? డాల్డాను ఇంగ్లాండ్ కు చెందిన లివర్స్ బ్రదర్స్ పరిచయం చేశారు. 1930లో డచ్ వ్యాపారస్తులు మన భారతదేశంలో డాల్డాను ప్రవేశపెట్టారు. దానికోసం 1931లో భారతదేశంలో హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్థాపించారు.

అయితే మొదట్లో దీనిని డాడా అని పిలిచేవారు. 1932లో ముంబైలో కూడా ఒక కర్మాగారాన్ని స్థాపించారు. కానీ అప్పుడు డచ్ కంపెనీ ఒక షరతును పెట్టింది అది ఏమిటంటే వారు డాడా అమ్మేటప్పుడు దాని పేరులో దీనిని కనిపెట్టిన మా పేరును కూడా పెట్టాలని చెప్పారు. కాబట్టి లివర్స్ బ్రదర్స్ డాడా మధ్యలో L ను చేర్చి డాల్డాగా మార్చారు. ఈ విధంగా డాల్డా అనే పేరు వచ్చింది.

అయితే డాల్డాను ప్రతి ఇంటికి ఆ సమయంలో ఎలా చేరవేయాలి అని అనుకున్నప్పుడు హార్వే డంకన్ అనే అతను మార్కెటింగ్ చేసి ఇతను చేసిన ప్రకటనలు, డాల్డా యొక్క సరసమైన ధరలు డాల్డాను భారతదేశంలోని ప్రతి ఇంటికి వెళ్లేలా చేశాయి. దీంతో అందరూ కూడా దీనిని నెయ్యికి బదులుగా వాడడం మొదలుపెట్టారు.

Flower Vase : ఫ్లవర్ వాజ్ లో ఉంచే పువ్వులు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

కానీ అదే సమయంలో స్వాతంత్య్రం వచ్చాక డాల్డా ఒక పెద్ద వివాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. డాల్డా అనేది దేశీయ నెయ్యి కాదు అని, దానిలో హానికరమైన కెమికల్స్ కలుపుతున్నారు అని, అది కల్తీ నెయ్యి అని అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా వీటన్నింటిని తట్టుకొని మన భారతదేశంలో డాల్డా తన స్థానాన్ని మార్కెట్ లో నిలబెట్టుకుంది. ఇప్పటికి కూడా చాలా మంది నెయ్యికి బదులు డాల్డాని వాడతారు.