Hangover : హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవడం ఎలా??

Kaburulu

Kaburulu Desk

November 29, 2022 | 01:05 PM

Hangover : హ్యాంగ్ ఓవర్ తగ్గించుకోవడం ఎలా??

Hangover :  ఈ మధ్య చాలామంది పార్టీలకు అలవాటు పడి డ్రింకింగ్ హ్యాబిట్ గా మార్చుకుంటున్నారు లేదా కొంతమంది వీకెండ్ పార్టీస్ కి బాగా అలవాటు పడుతున్నారు. పార్టీలో బాగా మందు తాగేసి మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగా ఆఫీస్ కి వెళ్ళాలి కానీ ఎక్కువగా తాగడం వలన హ్యాంగ్ ఓవర్ వస్తుంది. కొంతమంది ఎక్కువగా తాగకపోయిన హ్యాంగ్ ఓవర్ వస్తుంది అది వారి శరీరం తీరుపై ఆధారపడి ఉంటుంది.

హ్యాంగ్ ఓవర్ ను తగ్గించుకోవడానికి మనం తినే ఆహారాన్ని ఉపయోగించుకోవాలి. హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ వలన కూడా హ్యాంగ్ ఓవర్ ఉంటుంది.హ్యాంగ్ ఓవర్ లో ఉన్నప్పుడు బలహీనంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రోటీన్లు, కొవ్వులు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

Dry Lips in Winter : చలికాలంలో పెదాల పగుళ్ళకు చిట్కాలు

హ్యాంగ్ ఓవర్ ను తగ్గించుకోవడానికి ఉదయం టిఫిన్ లో భాగంగా గుడ్లు, అవకాడో లేదా కూరగాయలతో చేసిన ఆమ్లెట్ తీసుకుంటే మంచిది. ఇలా తీసుకుంటే ఇది మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చు, తగ్గులను నివారిస్తుంది. ఇంకా ఉదయం టిఫిన్ లో అవకాడో ఎగ్ టోస్ మరియు అరటిపండు ఉండేలా చూసుకోండి, ఇవి కూడా హ్యాంగ్ ఓవర్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక అందరికి తెలిసినట్టే పాలు, మజ్జిగ కూడా తాగొచ్చు. కానీ వాటితో పాటు ఏదైనా తింటే శరీరానికి శక్తి వస్తుంది.