Coconuts : థాయిలాండ్ లో కొబ్బరి బొండాలు ఇంత రేటా??

Kaburulu

Kaburulu Desk

November 29, 2022 | 01:27 PM

Coconuts : థాయిలాండ్ లో కొబ్బరి బొండాలు ఇంత రేటా??

Coconuts :  తెలివి ఉంటే దేన్నైనా, ఎలా అయినా బిజినెస్ చేయొచ్చు. ఇపుడు అన్ని రకాల వస్తువుల్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని కొనుక్కోవడం అందరికి సర్వసాధారణమైన విషయం అయిపోయింది. థాయిలాండ్ లో కొబ్బరిబోండాలను ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. దీనిలో వింత ఏముంది అనుకుంటే పొరపాటే.

 

మాములుగా కొబ్బరిబోండాలను బయట మనం కొనుక్కుంటే దాని ధర కేవలం 30 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. దానినే ఆన్లైన్ లో పెడితే మహా ఐతే ఇంకో 20 రూపాయలు ఎక్కువగా తీసుకుంటారు. కానీ థాయిలాండ్ వాళ్ళు నాలుగు కొబ్బరిబోండాల ధరను 28.99 డాలర్లుగా ఆన్లైన్ లో పెట్టారు అంటే దాదాపు 2300 రూపాయలు. అంటే ఒక్కో బొండాం ధర దాదాపు 600 రూపాయలు.

Dry Lips in Winter : చలికాలంలో పెదాల పగుళ్ళకు చిట్కాలు

అయితే ఇంత ధర పెట్టినా ఇవి బాగానే సేల్ అవుతున్నాయంట. ఎందుకంటే కొబ్బరిబోండాలను మామూలుగా కాకుండా వాటిని చుట్టూ కట్ చేసి, కొబ్బరిబొండానికి నాలుగు వైపులా తొక్కను, పైభాగాన్ని తీసేసి, పైన భాగాన్ని తీసిన ప్లేస్ లో ఒక ట్యాప్ ను పెడతారు. మనం స్ట్రా ఉపయోగించకుండా డైరెక్ట్ గా బాటిల్ లేదా టిన్ ఓపెన్ చేసినట్టు చేసుకొని కొబ్బరిబోండం తాగొచ్చు. అంతేకాక కొబ్బరి బొండం చుట్టూ రకరకాల ఆకర్షణీయమైన పెయింటింగ్స్, స్టిక్కర్స్ కూడా వేసి అందంగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. దీంతో ఈ రెడీ టు డ్రింక్ కొబ్బరిబోండాలకి థాయిలాండ్ లో మంచి గిరాకీ ఉంది. మరి మన దగ్గర ఇలాంటి బొండాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.