Dry Lips in Winter : చలికాలంలో పెదాల పగుళ్ళకు చిట్కాలు

Kaburulu

Kaburulu Desk

November 29, 2022 | 12:58 PM

Dry Lips in Winter : చలికాలంలో పెదాల పగుళ్ళకు చిట్కాలు

Dry Lips in Winter :  చలికాలం రాగానే సాధారణంగా ఎవ్వరికైనా ముఖం, చేతులు, కాళ్ళు, పెదాలు పొడిపొడిగా అవ్వడం, పగలడం లాంటివి జరుగుతాయి. పెదాలు పగలడమే కాకుండా ఎండిపోయినట్లు నిర్జీవంగా కనబడతాయి. పెదాలను చలి నుండి కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది.

*పెదాలపై పంచదార, తేనెను కలిపి రాసుకోవాలి. ఒక పది నిముషాల తరువాత పెదాలను గోరువెచ్చని నీటితో కడగాలి.
*కొబ్బరినూనెను కూడా పెదవులపై రాయవచ్చు. ఇది పెదాలు పగలకుండా చేస్తుంది.
*వెన్న, నెయ్యి లేదా ఆల్మండ్ ఆయిల్ కూడా పెదాలపై రాత్రి పడుకునే ముందు రాసుకోవచ్చు ఇలా చేసిన పెదాలు పగలకుండా ఉంటాయి.
*పచ్చి పాలల్లో దూదిని ముంచి దానితో పెదాలపై మర్దన చేసుకోవాలి ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
*ఆముదం నూనెలో నిమ్మరసం కలిపి దానిని పెదాలకు అప్లై చేసి పది నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.
*చలికాలంలో నీరు తక్కువగా తాగుతూ ఉంటాము దాని వలన కూడా పెదాలు పొడిబారడం జరుగుతుంటుంది. కాబట్టి సరిపడా నీరు తాగేలా చూసుకోవాలి.
*కొద్దిగా వెన్నలో కొన్ని చుక్కల తేనెను కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇది కూడా పెదాలు పొడిబారడం తగ్గేలా చేస్తుంది.
*గులాబీ రేకల్ని కొన్నింటిని పాలల్లో కలిపి పెదాలపై రాసుకొని కొంచెం సమయం తరువాత పెదాలను కడగాలి.