Home cooling tips : ఎండాకాలంలో AC లేకపోయినా మన గదిని చల్లగా ఉంచుకోవచ్చు తెలుసా?

  ఎండాకాలం రాగానే మన ఇల్లు వేడిగా మారుతుంది. అయితే మన గదిని, ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి మనం కొన్ని టిప్స్ పాటించవచ్చు. AC లేకపోయినా మనం మన ఇంటిని చల్లగా.............

Kaburulu

Kaburulu Desk

March 28, 2023 | 06:10 PM

Home cooling tips : ఎండాకాలంలో AC లేకపోయినా మన గదిని చల్లగా ఉంచుకోవచ్చు తెలుసా?

Home cooling tips :  ఎండాకాలం రాగానే మన ఇల్లు వేడిగా మారుతుంది. అయితే మన గదిని, ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి మనం కొన్ని టిప్స్ పాటించవచ్చు. AC లేకపోయినా మనం మన ఇంటిని చల్లగా ఉంచుకోగలుగుతాము. ఎండలో ఇంట్లో ఉక్కపోత లేకుండా చల్లగా ఉండడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే మన ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.

*ఎండాకాలంలో గదిని చల్లగా ఉంచడానికి సాయంత్రం సమయంలో కిటికీలు తెరిచి ఉంచాలి దీని వలన గది చల్లగా మారుతుంది. ఉదయం ఎనిమిది గంటల వరకు కిటికీలు తెరిచి ఉంచాలి. కిటికీలు తెరిచి ఉంచితే దోమలు వస్తాయి అనుకునేవారు దోమ తెరలు వాడాలి.

*కిటికీలకు కర్టైన్స్ వాడాలి అవి షేడ్స్ ఉండేలా చూసుకోవాలి. అవి ఎండను ఇంటిలోనికి రాకుండా ఉండేలా చేస్తాయి.

*మనం మన ఇంటిలో వాడే కర్టైన్ల కలర్స్ తేలికపాటివి అయి ఉండేలా చూడాలి. దీని వలన అవి ఎండను పీల్చుకోవు ఇంటిని చల్లగా ఉంచుతాయి.

*తలుపులకు, కిటికీలకు వాడే కర్టైన్స్ ను నీళ్లతో తడపాలి. ఇలా చేయడం వలన గాలికి గదిలోకి చల్లని గాలి వస్తుంది.

*మన ఇంటిలో స్టాండింగ్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ రెండు వాడడం వలన ఇంటి నిండా గాలి వచ్చి చల్లగా అవుతుంది. స్టాండింగ్ ఫ్యాన్లు వాడేటప్పుడు రొటేట్ అయ్యేవి వాడుకోవాలి అప్పుడే గాలి ఇల్లంతా చేరి గది చల్లగా మారుతుంది.

*ఇంటి లోపల, బయట కూడా మనం ఎక్కువ మొక్కలు పెంచేలా చూడాలి దీని వలన మన ఇల్లు చల్లగా మారుతుంది. మొక్కలు మన ఇంటిలోని వేడిని గ్రహించి చల్లదనాన్ని ఇస్తాయి.

*మన గదిలో అక్కడక్కడ చిన్న కుండలలో నీటిని నింపి ఉంచాలి ఇలా చేయడం వలన గది చల్లగా మారుతుంది. ఎందుకంటే కుండలలో నీరు ఆవిరిగా మారుతుంది ఈ విధంగా గది చల్లబడుతుంది.

*మన ఇంటిపై పైన గడ్డి, మొక్కలు ఉంచితే మన ఇల్లు చల్లగా ఉంటుంది.

*మనం ఉండే గదిలో కూల్ పెయింటింగ్స్ వాడడం వలన కూడా గది చల్లగా మారుతుంది.

AC : ఎండాకాలంలో AC బిల్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

*మన ఇంటిలో ఉండే కిటికీలకు తలుపులకు కొబ్బరి మ్యాట్లు, జనపనార మ్యాట్లు వేసుకొని వాటిని నీటితో తడుపుతూ ఉంటే కూడా ఇల్లు చల్లగా మారుతుంది. ఈ విధంగా AC లేకపోయినా మనం మన ఇంటిని ఎండాకాలంలో కూడా చల్లగా ఉంచుకోవచ్చు.