Pot Water : ఎండాకాలంలో ఫ్రిడ్జ్ కంటే కూడా కుండ మంచిది.. మట్టికుండలో నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలా తెలుసా?

ఎండాకాలం రాగానే మనం అందరం నీటిని ఎక్కువగా తాగుతుంటాము. అయితే అందరూ ఎక్కువగా ఇదివరికి మట్టి కుండలో నీటిని తాగేవాళ్ళము. కానీ ఇప్పుడు చాలా మంది ఎండాకాలం రాగానే ఫ్రిజ్ లో............

Kaburulu

Kaburulu Desk

March 14, 2023 | 02:11 PM

Pot Water : ఎండాకాలంలో ఫ్రిడ్జ్ కంటే కూడా కుండ మంచిది.. మట్టికుండలో నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలా తెలుసా?

Pot Water :  ఎండాకాలం రాగానే మనం అందరం నీటిని ఎక్కువగా తాగుతుంటాము. అయితే అందరూ ఎక్కువగా ఇదివరికి మట్టి కుండలో నీటిని తాగేవాళ్ళము. కానీ ఇప్పుడు చాలా మంది ఎండాకాలం రాగానే ఫ్రిజ్ లో నీటిని తాగుతున్నారు. కానీ ఫ్రిజ్ లో నీటిని తాగడం కంటే మట్టి కుండలో ని నీటిని తాగడం మంచిది ఇంకా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుండలో నీటిని తాగడం అనేది మన భారతీయ సంప్రదాయకరమైన పద్దతి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

*మట్టి కుండలో నీటిని ఉంచడం వలన అది ఎండాకాలంలో నీటిని చల్లబరిచి తాజాగా ఉంచుతుంది. ఈ విధంగా ఉన్న చల్లని నీటిని తాగడం వలన మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది.
*మట్టి కుండలోని చల్లని నీటిని తాగడం వలన ఎండాకాలంలో వడదెబ్బ తగిలే అవకాశం తగ్గుతుంది.
*కుండలకు ఉపయోగించే మట్టిలో పోరస్ లక్షణాలు ఉంటాయి. ఇవి నీటిలోని మలినాలను తొలగించి నీటిని శుద్ధి చేస్తాయి.
*కుండను తయారుచేసిన మట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి. ఇవి నీటిలో ph స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇలా ఉన్న ఆల్కలీన్ నీరు మన ఆరోగ్యానికి చాలా మంచిది.
*మట్టి కుండలో నీటిని తాగడం వలన మనకు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
*మట్టి కుండలో నీటిని తాగడం వలన ఎండాకాలంలో చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.
*మట్టి కుండకు ఉపయోగించిన మట్టిలో ఉండే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మట్టి కుండలో ఉంచిన నీటిలోకి ఈ ఖనిజలవణాలు వెళ్లి ఇంకా పోషకాలు కలిగిన నీటిగా మారతాయి.
*మట్టి కుండలో నీటిని తాగడం వలన దానిలో ఉండే ఎలెక్ట్రోలైట్లు, మినరల్స్ మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
*మట్టి కుండలో నీటిని తాగడం వలన ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
*ఎండాకాలంలో చర్మం జిగటగా మారుతుంది. చర్మంపై మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంది. కుండలో నీటిని తాగడం వలన చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

Nail Arts : సరికొత్త నెయిల్ ఆర్ట్స్.. మీరు కూడా ట్రై చేయండి..