Aloe Vera : జుట్టు బాగా పెరగాలి అనుకుంటున్నారా ? అయితే కలబందని ఇలా వాడాల్సిందే..

Kaburulu

Kaburulu Desk

September 23, 2022 | 09:36 AM

Aloe Vera : జుట్టు బాగా పెరగాలి అనుకుంటున్నారా ? అయితే కలబందని ఇలా వాడాల్సిందే..

Aloe Vera :  సాధారణంగా ఆడవాళ్లు జుట్టు పొడవుగా, దృఢంగా, మృదువుగా ఉండాలనుకుంటారు. కానీ చాలామంది పొడిబారిన జుట్టు, పలచని జుట్టు, చుండ్రు లాంటి సమస్యలతో బాధపడతారు. అందరి ఇళ్లల్లో దొరికే కలబందని వాడి మన జుట్టు రాలటం తగ్గించవచ్చు. కలబంద వాడకం వల్ల జుట్టు సహజసిద్ధంగా మృదువుగా మారుతుంది. జుట్టు త్వరగా పెరగాలని మనం ఎన్నో పద్ధతులు, లోషన్లు, నూనెలు వాడటం సహజం. వాటన్నిటికంటే కూడా తక్కువ బడ్జెట్ లో మన ఇంటి ముందు ఉండే చిన్న కలబందతో మన జుట్టుని బాగా పెంచుకోవచ్చు.

Panner : పన్నీర్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా??

కలబంద గుజ్జుని 4 స్పూన్లు, తేనె 1 స్పూన్, కొబ్బరి నూనె 2 స్పూన్లు, విటమిన్ ఈ 1 క్యాప్సిల్ ను కలిపిన ప్యాక్ ను వారానికి ఒకసారి జుట్టుకి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి.
*ఈ ప్యాక్ రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు అధికంగా పెరుగుతుంది.
*మృదువుగా మారుతుంది.
*పొడిబారడం కూడా తగ్గుతుంది.
*జుట్టు మెరుస్తుంది కూడా.
*అంతేకాక చుండ్రు సమస్యని కూడా ఈ ప్యాక్ తో నిర్ములించవచ్చు.
*కలబంద గుజ్జుకి విటమిన్ ఈ క్యాప్సిల్ జతచేయటం వల్ల మీ తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది.