Comb Cleaning : దువ్వెనని క్లీన్ గా ఉంచుకోవాల్సిందే.. లేకపోతే..

జుట్టు ఊడిపోతున్నప్పుడు మనం చాలా కంగారుగా ఏ విధమైన ఆయిల్ వాడాలా లేకపోతే షాంపూ మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ వాడుకునే దువ్వెన ఎలా ఉందో చూసుకోవాలి. దువ్వెనను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే................

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 04:00 PM

Comb Cleaning : దువ్వెనని క్లీన్ గా ఉంచుకోవాల్సిందే.. లేకపోతే..

Comb Cleaning :  జుట్టు ఊడిపోతున్నప్పుడు మనం చాలా కంగారుగా ఏ విధమైన ఆయిల్ వాడాలా లేకపోతే షాంపూ మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనం అన్నిటికంటే ముఖ్యంగా రోజూ వాడుకునే దువ్వెన ఎలా ఉందో చూసుకోవాలి. దువ్వెనను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది ఎందుకంటే దువ్వెనతో కూడా మన జుట్టుకి దుమ్ము, ధూళి చేరతాయి ఇంకా జుట్టు సమస్యలు వస్తాయి.

మన జుట్టుకి ఏవైనా జెల్స్ వంటివి రాసుకున్న తరువాత దువ్వితే దువ్వెనని అలాగే ఉంచకూడదు. అలాగే ఉంచితే దువ్వెనకి జెల్ ఉండడం వలన ఎక్కువ దుమ్ము ని అబ్సర్వ్ చేసుకుంటుంది. దువ్వుకున్న తరువాత దువ్వెనని వెంటనే కడగాలి అప్పుడు ఎక్కువ దుమ్ము అంటకుండా ఉంటుంది. దువ్వెనని మామూలుగా వారానికి రెండు సార్లు కడుగుతూ ఉండాలి. అప్పుడు ఎక్కువ దుమ్ము అనేది ఉండదు. తలస్నానం చేసిన తరువాత కడిగిన దువ్వెనతోనే దువ్వుకోవాలి. ఇలా చేస్తే మన జుట్టుకి వచ్చే సమస్యలు కొన్ని అయినా తగ్గుతాయి.

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా??

దువ్వెనని శుభ్రంగా చేయడానికి వేడి నీళ్ళల్లో షాంపూ వేసి దానిలో దువ్వెనని నానబెట్టాలి. కొంత సమయం తరువాత మెత్తని బ్రష్ తో గోరువెచ్చని నీటితో కడగాలి. అప్పుడు దువ్వెన శుభ్రంగా ఉంటుంది. అలాగే మనం వాడే దువ్వెనని ఆరు నెలలకి ఒకసారి అయినా మార్చాలి. అప్పుడే మన జుట్టుకి అధికంగా వచ్చే సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దువ్వెనని క్లీన్ గా ఉంచుకోవాలి.