White Hair : ఈ పదార్థాలు తింటున్నారా? కచ్చితంగా తెల్లజుట్టు త్వరగా వచ్చేస్తుంది..

మన అందరికీ జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ ఉండాలని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో యువతీ యువకులకు, చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తుంది. దానికి కారణం మనం తినే ఆహారపదార్థాలు కూడా. చాలా మంది..................

Kaburulu

Kaburulu Desk

February 10, 2023 | 06:21 AM

White Hair : ఈ పదార్థాలు తింటున్నారా? కచ్చితంగా తెల్లజుట్టు త్వరగా వచ్చేస్తుంది..

White Hair :  మన అందరికీ జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ ఉండాలని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో యువతీ యువకులకు, చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తుంది. దానికి కారణం మనం తినే ఆహారపదార్థాలు కూడా. చాలా మంది ఒకటో రెండో తెల్ల వెంట్రుకలు ఉంటే వాటిని తీసేసుకుంటూ ఉంటారు. కానీ చాలా తెల్ల వెంట్రుకలు వస్తే హెయిర్ కలర్, హెన్నా వంటివి పెట్టుకుంటూ ఉంటారు. కానీ దీని వలన మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి.

కాబట్టి అసలు తెల్ల జుట్టు తొందరగా మనకు రాకుండా ఉండడానికి మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తినకూడదు. ఈ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా తెల్లజుట్టు త్వరగా వస్తుంది. చక్కరతో చేసిన స్వీట్స్ ని ఎక్కువగా తినడం వలన మన జుట్టు తొందరగా తెల్లబడతుంది. విటమిన్ ఇ లోపం వలన జుట్టు తెల్లబడుతుంది. చక్కర ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం వలన మన శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు కాబట్టి జుట్టు తొందరగా తెల్లబడుతుంది.

ఉప్పు ఎక్కువగా తిన్నా అది మన శరీరంలో జుట్టు తెల్లబడేలా చేస్తుంది. కూల్ డ్రింక్స్ తాగడం వలన కూడా మన జుట్టు తెల్లబడుతుంది. దీనిలో ఉండే చక్కర, సోడియం మన శరీరంలో జుట్టు తెల్లబడేలా చేస్తుంది. మోనోసోడియం గ్లూటామేట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తినడం వలన కూడా మన జుట్టు తెల్లగా మారుతుంది. ఎందుకంటే అవి మన శరీరం విటమిన్లను గ్రహించకుండా చేస్తుంది. కాబట్టి జుట్టు తెల్లగా మారుతుంది.

Ginger Garlic Paste : అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలనుకుంటున్నారా?? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

మన జుట్టు తెల్లగా మారకుండా ఉండడానికి మనం తినే ఆహారపదార్థాలను గమనించాలి. ఉప్పు, చక్కర, కూల్ డ్రింక్స్, మోనోసోడియం గ్లూటామేట్ వంటివి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తినకుండా ఉండాలి. ఇలా చేయడం వలన మన జుట్టు తొందరగా తెల్లగా మారకుండా ఉంటుంది.