Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా??

35 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తుంది కంగనా. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీకి సీక్రెట్ చెప్పింది ఈ హిమాచల్ భామ.......

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 02:08 PM

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా??

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన సినిమాలతోని, తన మాటలతో బాగా పాపులర్ అయింది. దేశం కోసం, దేశంపై ఎవరైనా విమర్శలు చేసినా వారిపై కౌంటర్లు వేస్తుంది. బాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. బాలీవుడ్ మాఫియాపై బహిరంగంగానే మాట్లాడుతుంది. సినిమాలకి, దేశానికి చెందిన పలు సమస్యలపై సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉంటుంది కంగనా. తనని ఎంతమంది బెదిరించినా తాను చేయాలనుకున్నది చేస్తుంది అందుకే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా.

మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసిన కంగనా అనంతరం లేడీ ఓరియెంటెడ్, కంటెంట్ సినిమాలకే పరిమితమైంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనే బిజీగా ఉంది. 35 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తుంది కంగనా. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీకి సీక్రెట్ చెప్పింది ఈ హిమాచల్ భామ.

Milk : ఏ రకమైన పాలు తాగితే మంచిది?

కంగనా మాట్లాడుతూ.. నేను రోజూ పాల మీగడతో నా ఫేస్ ని చాలా సున్నితంగా మసాజ్ చేస్తాను. అలాగే రోజ్ వాటర్ తో కూడా నా ఫేస్ ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను. వారానికి మూడు సార్లు తలను ఆప్రికాట్‌ ఆయిల్‌తో బాగా మర్దన చేసి ఆవిరి పడ్తాను. రెగ్యులర్ గా బాదంపప్పు తింటాను అని తెలిపింది. ఇలా ఫేస్ గ్లో కోసం పాల మీగడ, రోజ్ వాటర్, అందమైన కురుల కోసం ఆప్రికాట్ ఆయిల్ వాడుతున్నట్టు తెలిపింది కంగనా రనౌత్.