Saffron : కుంకుమ పువ్వుని ఇలా వాడి అందంగా తయారవ్వండి.. ఎన్ని ప్రయోజనాలో కుంకుమపువ్వుతో..

కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా గర్భిణీ స్త్రీలు పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తుంటారు. కానీ కుంకుమ పువ్వు ఉపయోగించడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అందానికి కూడా.....................

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 06:10 AM

Saffron : కుంకుమ పువ్వుని ఇలా వాడి అందంగా తయారవ్వండి.. ఎన్ని ప్రయోజనాలో కుంకుమపువ్వుతో..

Saffron :  కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా గర్భిణీ స్త్రీలు పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తుంటారు. కానీ కుంకుమ పువ్వు ఉపయోగించడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అందానికి కూడా కుంకుమపువ్వుని వాడతారు.

ఒక స్పూన్ పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వును రాత్రంతా నానబెట్టాలి. ఆ తరువాత దానిలో ఒక స్పూన్ కొబ్బరినూనెను కలిపి దానిని ముఖానికి అప్లై చేసి పదిహేను నిముషాలు పాటు ఉంచుకోవాలి తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం పొడి బారకుండా ఉంటుంది. కుంకుమ పువ్వును పాల క్రీంలో బాగా కలిపి దానిని రాత్రి పడుకునే ముందు ముఖానికి బాగా మర్దన చేసుకోవాలి మరునాడు ఉదయం లేచిన తరువాత ముఖం కడుగుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

కుంకుమ పువ్వును తేనెతో కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చర్మం పొడి బారకుండా ఉంటుంది. కుంకుమ పువ్వును పాలు, గంధంతో కలిపి పేస్ ప్యాక్ చేసుకొని ముఖంపై రాసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో మర్దన చేసుకుంటూ ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు తగ్గుతాయి మరియు చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

Papaya : బొప్పాయి పండు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?? మీకు తెలుసా?

ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు కుంకుమపువ్వును తులసితో కలిపి వాడితే తగ్గుతాయి. ముందుగా తులసి ఆకులను గ్రైండ్ చేసి దానిలో కుంకుమ పువ్వును కలిపి ముఖంపై పట్టించాలి. కాసేపు అయిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చర్మంపై వచ్చిన మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. కుంకుమపువ్వు ఆరోగ్యానికే కాదు మనం అందంగా తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది.