Face Glow Tips : ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఫేస్‌ని తళతళ మెరవనివ్వండి..

మన ఫేస్ ని తళతళ మెరవడానికి, మన ఫేస్ లో గ్లో రావడానికి ఈ న్యాచురల్ టిప్స్ ని వాడొచ్చు...............

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 08:12 PM

Face Glow Tips : ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఫేస్‌ని తళతళ మెరవనివ్వండి..

Face Glow Tips :  మన ఫేస్ ని తళతళ మెరవడానికి, మన ఫేస్ లో గ్లో రావడానికి ఈ న్యాచురల్ టిప్స్ ని వాడొచ్చు.

*నిమ్మ రసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ తో మీ చర్మాన్ని తాజాగా ఉంచవచ్చు. నిమ్మరసం చర్మ సౌందర్యానికి బాగా తోడ్పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ మూడు టేబుల్ స్పూన్స్ తీసుకొని మూడింటిని కలుపుకోవాలి. మొదటగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసి ఆపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి . వేళ్ళతో నెమ్మదిగా రాసి మర్దన చేయాలి. ఆ తర్వాత సబ్బుతో ఫేస్ కడుక్కోవాలి. కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా కూడా అప్లై చేయవచ్చు. స్నానానికి వెళ్లే ముందు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.
*హాఫ్ టేబుల్ స్పూన్ గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా మూడు రోజులకి ఒకసారి చేస్తే ముఖంపై ముడతలు తగ్గటంతో పాటు ఫేస్ లో గ్లో పెరుగుతుంది.
*నాలుగు తులసి ఆకులు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖంపై నల్ల మచ్చలను నివారించి ముఖంలో కళని చూడొచ్చు.
*అరచేతిలో ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని రెండు రెక్కల కుంకుమ పువ్వుని వేసి రంగరించి ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఇలా ఇంటిలో చిట్కాలతోనే మన ఫేస్ లో మంచి కళని తెప్పించుకోవచ్చు.