Kangana Ranaut : సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టిన స్టార్ హీరోయిన్..

కంగనా తన వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేస్తూ.. ఇవాళ్టితో నా షూటింగ్ పూర్తయింది. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఈ ప్రయాణం హాయిగా జరిగిందనుకోవచ్చు. కానీ ఈ సినిమా కోసం నేను.............

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 10:26 AM

Kangana Ranaut : సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టిన స్టార్ హీరోయిన్..

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం అన్నీ కంటెంట్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది. బాలీవుడ్ మాఫియాపై, దేశ వ్యతిరేక శక్తులపై విరుచుకుపడే కంగనా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క దేశంలోని పలు అంశాలపై మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని నెలల క్రితం ధాకడ్ సినిమాతో వచ్చి పరాజయం చూసింది కంగనా.

కంగనా రనౌత్ ప్రస్తుతం ఇండియాలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రని కంగనా రనౌత్ పోషిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకి డైరెక్టర్, నిర్మాత కూడా కంగనానే కావడం గమనార్హం. ఈ సినిమా ‘ఎమర్జెన్సీ అండ్‌ ఆపరేషన్‌ బ్లూస్టార్‌’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమాలో దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తయింది. కంగనా నటిస్తున్న ఇందిరా గాంధీ పాత్ర షూటింగ్ మొత్తం అయిపోయింది. దీనిపై కంగనా ఓ ఎమోషనల్ పోస్ట్ పెడుతూ షాకింగ్ విషయాన్ని తెలిపింది.

Mangli : నాపై ఎలాంటి రాళ్ళ దాడి జరగలేదు.. ఇదంతా కుట్ర.. మంగ్లీ అధికారిక లేఖ..

కంగనా తన వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేస్తూ.. ఇవాళ్టితో నా షూటింగ్ పూర్తయింది. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఈ ప్రయాణం హాయిగా జరిగిందనుకోవచ్చు. కానీ ఈ సినిమా కోసం నేను కష్టపడి సొంతంగా సంపాదించుకున్న నా ఆస్తులు తాకట్టు పెట్టాను. షూటింగ్ లో డెంగ్యూ ఫీవర్ వల్ల బాధపడ్డాను. ఎన్నో కష్టాలున్నా ఈ సినిమా షూట్ చేస్తున్నాను. నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధపెట్టలేను. నా గురించి ఆలోచించేవాళ్ళు బాధపడకండి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. నా వెనక ఉండి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని తెలిపింది. దీంతో సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టడంతో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.