Kangana Ranaut : మరోసారి బాలీవుడ్ మాఫియా బయటపడింది అంటూ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులపై కంగనా ఫైర్..

2022లో రిలీజయిన సినిమాలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అవార్డులు ఇచ్చారు. అయితే ఈ అవార్డుల్లో RRR సినిమాకి ఫిలిం అఫ్ ది ఇయర్, రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ కి బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు ఇచ్చారు. మిగిలినవన్నీ.................

Kaburulu

Kaburulu Desk

February 22, 2023 | 09:16 AM

Kangana Ranaut : మరోసారి బాలీవుడ్ మాఫియా బయటపడింది అంటూ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులపై కంగనా ఫైర్..

Kangana Ranaut :  మన దేశ సినీ అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. 2022లో రిలీజయిన సినిమాలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అవార్డులు ఇచ్చారు. అయితే ఈ అవార్డుల్లో RRR సినిమాకి ఫిలిం అఫ్ ది ఇయర్, రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ కి బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు ఇచ్చారు. మిగిలినవన్నీ బాలీవుడ్ వాళ్ళకే వెళ్లాయి. అందులోను రణబీర్ కపూర్, అలియా భట్ కి బెస్ట్ హీరో, హీరోయిన్ ఇవ్వడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే బాగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నా వాళ్లకి ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఈ అవార్డులపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విమర్శలు చేసింది. ఈ అవార్డులన్నీ కావాలనే వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ నెపోటిజం, బాలీవుడ్ మాఫియా చూపించారు. అందుకే వాళ్లకు అవార్డులు వచ్చాయి. అసలు వాళ్ళకి అవార్డులు పెద్ద అబద్దం, అవన్నీ కావాలని ఇచ్చినవే అంటూ వ్యాఖ్యలు చేసింది.

Balakrishna : వాళ్ళ బాధ్యత నాది.. విజయ్ సాయి రెడ్డికి బాలయ్య మాట..

అలాగే నేనైతే బెస్ట్ యాక్టర్ రిషబ్ శెట్టి, బెస్ట్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ టబుకి ఇస్తాను. మరిన్ని లిస్ట్ కూడా మళ్ళీ చెప్తాను అంటూ వ్యాఖ్యానించింది. దీంతో మరోసారి కంగనా వ్యాఖ్యలు వైరల్ గా మారగా పలువురు కంగనాకు సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం ఆమెను కూడా విమర్శిస్తున్నారు.