Panner : పన్నీర్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

September 22, 2022 | 09:48 AM

Panner : పన్నీర్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా??

Panner :  పన్నీర్ అనేది పాల నుంచి తయారైన ఓ తినే పదార్థం. చాలా మంది పన్నీర్ ని ఇష్టంగా అతింటారు. పన్నీర్ తో కుర్మా, పన్నీర్ మసాలా కర్రీ, పన్నీర్ టిక్కా, పన్నీర్ బట్టర్ మసాలా, కొన్ని స్వీట్స్ తయారుచేస్తారు. కొన్ని వంటల్లో కూడా పన్నీర్ ని వాడతారు. నాన్ వెజ్ తిననివాళ్ళు ఎక్కువగా పన్నీర్ ని తింటారు. పన్నీర్ ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ లో కాల్షియమ్, విటమిన్ D, విటమిన్ B 12 మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. పన్నీర్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

పన్నీర్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు:-

* రొమ్ము కాన్సర్ రాకుండా పన్నీర్ నిరోధిస్తుంది.
* పన్నీర్ రోజూ తింటే దీని వల్ల లభించే కాల్షియమ్ పిల్లలు, పెద్దలలో ఎముకలు గట్టి పడేలా చేస్తుంది.
* గర్భవతులకు కూడా మంచి ఆహరం పన్నీర్.
* పన్నీర్ లో లభించే ప్రోటీన్ అథ్లెటిక్స్, బాడీ బిల్డర్స్, మహిళలకు, ఆటలు ఆడేవారికి చాలా ముఖ్యమైన ఆహరం.
* రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, టెన్షన్ లను తట్టుకోవడానికి పన్నీర్ ఉపయోగపడుతుంది.
* పిల్లల్లో ఆకలిని పెంచడానికి పన్నీర్ సహకరిస్తుంది.
* పన్నీర్ రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పన్నీర్ ని మన ఆహారంలో భాగంగా చేసుకుందాం.