Bathukamma : బతుకమ్మ తయారుచేయడానికి ఏమేమి పూలు వాడతారో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

September 23, 2022 | 09:24 AM

Bathukamma : బతుకమ్మ తయారుచేయడానికి ఏమేమి పూలు వాడతారో తెలుసా?

Bathukamma :  తెలంగాణలో బతుకమ్మ గొప్ప పండుగ. బతుకమ్మని పదకొండు రకాల పూలతో అలంకరించి గౌరీ మాత ప్రతిమగా భావిస్తారు. అందరూ వాళ్ళ ఇళ్లల్లో బతుకమ్మని పూలతో తయారుచేసి గుడికి లేదా అందరూ కలిసి ఆడే చోటికి తీసుకువెళ్తారు. అక్కడ మహిళలంతా కలిసి బతుకమ్మలని ఒకచోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ పండగని జరుపుకుంటారు. తెలంగాణాలో బతుకమ్మ వేడుక తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

Panner : పన్నీర్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా??

బతుకమ్మలో ముఖ్యంగా 11 రకాల పూలని వాడతారు. 1. తంగేడు పూలు, 2. తామర పూలు, 3. గునుగు పూలు, 4.గుమ్మడి పూలు, 5.కట్ల పూలు, 6. బీర పూలు, 7. బొగడబంతి పూలు, 8. సీత జడ పూలు, 9. బంతి పూలు, 10. చామంతి పూలు,11. గులాబీ పూలు.. ఈ పూలన్నిటిని కలగలిపి చక్కగా బతుకమ్మలాగా పేరుస్తారు. చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు ఈ బతుకమ్మలని పేరుస్తారు. కాలక్రమేణా ఇక్కడున్న పూలలో అన్ని విరివిగా దొరకకపోవడంతో ఉన్న పూలతో, మార్కెట్లో దొరికే పూలతో బతుకమ్మని తయారుచేస్తున్నారు.