Aloe Vera : కలబంద ప్రయోజనాలు తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 04:50 PM

Aloe Vera : కలబంద ప్రయోజనాలు తెలుసా..?

Aloe Vera : చాలామంది ఇళ్లలో దానంతట అదే పెరుగుతూ ఉంటుంది కలబంద (అలోవేరా). ఎక్కువ నీరు పోయక పోయినా బతికే ఎడారి మొక్క. దానిలో ఉండే ఔషధ లక్షణాలు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్య పరంగా కూడా కలబంద అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. కాస్మెటిక్స్ , ఫుడ్స్ లో, స్కిన్ కేర్, మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఔషధ విషయానికొస్తే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వివిధ విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉన్న మొక్క. బరువు తగ్గడంలోను, రోగ నిరోధక శక్తి పెంచడం వీటి యొక్క ముఖ్య ప్రయాజనం. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో 20% కలబంద గుజ్జును కలిపి తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి, మలబద్దకం నుండి బయటపడవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులోకి తేవచ్చు. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లను పుష్కలంగా అందిస్తుంది. ఇంకా కలబంద గాయాలపై రాస్తే త్వరగా తగ్గుతాయి. విరోచనాలు సమస్యలు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధం.

White Rice Vs Brown Rice : వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఏది తినాలి??

కొబ్బరి నూనెలో కలబంద గుజ్జును కలిపి దాన్ని తలకు పట్టిస్తే చాలు చుండ్రు వదిలిపోతుంది, మృత కణాలు తొలగిపోతాయి, మీ జుట్టు మెరుస్తూ, స్మూత్ గా మారుతుంది. జుట్టు రాలి పోయే వారు ఇలా చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కొంతమంది కలబంద పేస్ ప్యాక్ లని కూడా ఉపయోగిస్తారు. రెగ్యులర్ గా కలబంద ఉపయోగించడం వలన ఆరోగ్య మరియు సౌందర్య పరంగా ఫలితాలు పొందవచ్చు.