Blood Circulation : రక్తం శుద్ధిగా ఉండాలంటే.. ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఏం చేయాలో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 07:00 PM

Blood Circulation : రక్తం శుద్ధిగా ఉండాలంటే.. ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, ఏం చేయాలో తెలుసా..?

Blood Circulation :  మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా జరుగుతూ ఉంటుంది. రక్తంలోని మలినాలు ఉన్నట్లైతే వాటి వలన మనకు కొన్ని రకాల చర్మ సమస్యలు వస్తాయి. అయితే అది శుద్ధిగా మరియు ఎటువంటి ఆటంకం లేకుండా మన శరీరం అంతా క్రమం తప్పకుండా వ్యాపించాలి అంటే మనం కొన్ని ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

* బీట్ రూట్ లో ఉండే ఫైబర్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని తగ్గిస్తుంది.
* నీళ్ళు మన శరీరానికి చాలా ముఖ్యం రక్తం శుద్ధిగా ఉండాలంటే కూడా రోజుకు కనీసం మూడు నుంచి అయిదు లీటర్ల నీళ్ళు కచ్చితంగా తాగాలి.
* తులసి ఆకుల్లో ఉండే ఆక్సిజెన్, విటమిన్ కె, ఐరన్ రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఎర్ర రక్తకణాల అభివృద్ధికి సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి తులసి ఆకులను రోజూ తినాలి.
* ఆకుకూరలు, క్యాబేజి, క్యాలీఫ్లవర్ వంటివి వారానికి రెండు సార్లైనా తినాలి అవి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.
* రోజూ కొద్దిగా నిమ్మరసం తాగితే కాలేయంలోని ట్యాక్సిన్లు బయటకు పోతాయి.
* పసుపులో ఉండే యాంటి సెప్టిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
* ఉసిరి, అల్లం, వెల్లుల్లి కూడా మన రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి.
* ముఖ్యంగా వాకింగ్, వ్యాయామం చేయాలి లేదా ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వలన రక్తం శుద్ధిగా ఉంటుంది.
* నిద్రకు ఈ రోజుల్లో చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. కానీ రోజూ ఎనిమిది గంటల నిద్ర అనేది అందరికి ముఖ్యమే. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కాబట్టి ఈ ఆహార పదార్థాలని తింటూ మన రక్తాన్ని శుద్ధిగా ఉంచుకోవచ్చు.