Fruits : పండ్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 07:00 PM

Fruits : పండ్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..

Fruits :  పండ్లను మనం తింటే అన్ని రకాల పోషకాలు లభిస్తాయని తెలుసు. అంతే కాకుండా పండ్లలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. డాక్టర్లు కూడా అనారోగ్యానికి గురైన వారిని పండ్లు తినమని సలహా ఇస్తూ ఉంటారు. కానీ పండ్లు తినడం వలన మనకు ఎంత మంచి జరుగుతుందో అదే విధంగా సరైన రీతిలో పండ్లను తినకపోతే అంతే నష్టం కూడా జరుగుతుంది అని ప్రముఖ డైటీషియన్స్ చెప్తున్నారు.

పండ్లను తిన్న వెంటనే నీళ్ళు తాగరాదు. అందులోనూ నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, స్ట్రాబెరి, కీరదోసకాయ, నారింజ వంటి పండ్లను తిన్న వెంటనే ఖచ్చితంగా నీళ్ళు తాగకూడదు. తాగితే పి హెచ్ శాతం మారిపోతుంది ఇంకా డయేరియా, కలరా వంటివి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో అందరూ పండ్లను తినేటప్పుడు తొక్క తీయాల్సిన అవసరం లేనివాటికి కూడా తొక్క తీసేసి తింటున్నారు కానీ ఇలా తినడం వలన తొక్కలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు,ఫైబర్ మన శరీరానికి అందవు కాబట్టి యాపిల్ వంటి పండ్లను తొక్క తీయకుండానే తినాలి.

Winter : చలికాలంలో ఈ పనులు చేయకండి..

రాత్రి పూట పడుకునే ముందు పండ్లను తినకూడదు తింటే అవి కడుపులో జీర్ణం అవ్వక అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. పండ్లను ఇతర పదార్థాలతో కలిపి తినకూడదు అలా తింటే అవి మనకు జీర్ణం అవ్వవు. కాబట్టి పండ్లను స్నాక్స్ రూపంలో వేటితోనూ కలవకుండా విడిగా తినాలి. అప్పుడే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.