Sandwich : శాండ్ విచ్.. ఇలా చేసుకొని అలా తినేయండి..

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 08:00 PM

Sandwich : శాండ్ విచ్.. ఇలా చేసుకొని అలా తినేయండి..

Sandwich :  సాయంత్రం పూట లేదా రాత్రి పూట ఏం తినాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏమన్నా తింటే రాత్రి పూట హెవీ అవుతుందేమో అని, బజ్జిలు లాంటివి తింటే ఆయిల్ ఫుడ్ అని, రాత్రి పూట అరగదేమో అని.. ఇలా చాలా మంది రాత్రి పూట, సాయంత్రం పూట ఏం తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సింపుల్ గా, హెల్త్ కి కూడా బాగుండేలా, సింపుల్ గా తయారయ్యే వెజ్ శాండ్ విచ్ కరెక్ట్ గా సూట్ అవుతుంది.

బయట షాపుల్లో చాలా కాస్ట్ పెట్టి, దానికి రకరకాల పదార్థాలు కలిపి, ఎక్కువ రేటుతో శాండ్ విచ్ లని అమ్ముతారు. కానీ అవేమి లేకుండా తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో, తక్కువ కాస్ట్ లో మనం కూడా వెజ్ శాండ్ విచ్ ని తయారు చేసుకోవచ్చు.

శాండ్ విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
* రెండు బ్రెడ్ ముక్కలు
* కీర దోసకాయ ముక్కలు
* వెజ్ మయోనీస్
* టమాటో సాస్
* వెన్న
* మిరియాల పొడి
* ఉప్పు

Winter : చలికాలంలో ఈ పనులు చేయకండి..

ముందుగా బ్రెడ్ ముక్కపై వెన్నను రాసి దానిపై టమాటా సాస్, వెజ్ మయోన్నైస్ వేసి మళ్ళీ దానిపై కీర దోసకాయ ముక్కలను రౌండ్ గా కోసుకొని పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడిని దానిపై చల్లుకొని ఇంకొక బ్రెడ్ ముక్కతో కప్పాలి అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన శాండ్ విచ్ రెడీ. కొంతమంది బ్రెడ్ ముక్కని వెన్నలో కాల్చుకొని పైన ఇవి పెట్టుకొని కూడా తింటారు. కావాలనుకునే వారు మరిన్ని కూరగాయ ముక్కలని కూడా జతచేర్చొచ్చు. సాయంత్రం పూట, రాత్రి పూట చాలా లైట్ గా, ట్రెండీగా తినాలనుకుంటే ఇలా వెజ్ శాండ్ విచ్ ని చేసుకొని తినేయండి.