Sapota : ఎండాకాలంలో సపోటా కచ్చితంగా తినండి.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

ఎండాకాలంలో లభించే పండ్లలో సపోటా ఒకటి. ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో సపోటాను తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి............

Kaburulu

Kaburulu Desk

March 14, 2023 | 10:02 AM

Sapota : ఎండాకాలంలో సపోటా కచ్చితంగా తినండి.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

Sapota :  ఎండాకాలంలో లభించే పండ్లలో సపోటా ఒకటి. ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో సపోటాను తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాను మిల్క్ షేక్స్, జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సపోటాను ఎండాకాలంలో తినడం వలన అది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. సపోటాను తినడం వలన మన శరీరంలో హార్మోన్లను బ్యాలన్స్ చేసి అడ్రినల్ గ్రంధులు చురుకుగా పనిచేసేలా చేస్తాయి.

*సపోటాలో ఉండే కాల్షియం మన ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
*సపోటాను చిన్న పిల్లలు, పెద్దవారు రోజూ తినడం వలన వారికి అన్ని రకాల పోషకాలు అందుతాయి.
*సపోటా తినడం వలన జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి. చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.
*రక్తహీనత సమస్య ఉన్నవారు సపోటా తినడం వలన రక్తహీనత తగ్గుతుంది.
*సపోటా తినడం వలన అది మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరగడానికి సహాయపడుతుంది.
*చర్మంపై ముడతలు తగ్గడానికి సపోటా ఉపయోగపడుతుంది.
*మలబద్దకం సమస్య ఉన్నవారు సపోటా తినడం వలన తగ్గుతుంది.
*సపోటాలో ఉండే పొటాషియం రక్తప్రసరణ బాగా జరిగి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
*ఎండాకాలంలో సపోటా తినడం వలన దానిలో ఉండే ఫ్రాక్టోజ్ మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
*సపోటా మన శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.