Fridge cooling Water : ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
ఎండాకాలం రాగానే అందరూ కూల్ వాటర్ తాగడానికి ఇష్టపడతారు. పాతకాలంలో అందరూ కుండలో నీటిని తాగేవారు. కానీ ఇప్పుడు అందరూ ఫ్రిజ్ లో కూలింగ్ వాటర్ ని తాగుతున్నారు. కానీ.............

Fridge cooling Water : ఎండాకాలం రాగానే అందరూ కూల్ వాటర్ తాగడానికి ఇష్టపడతారు. పాతకాలంలో అందరూ కుండలో నీటిని తాగేవారు. కానీ ఇప్పుడు అందరూ ఫ్రిజ్ లో కూలింగ్ వాటర్ ని తాగుతున్నారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఫ్రిజ్ లో నీరు కృత్రిమంగా చల్లబడుతుంది. కాబట్టి దీనిలోని అతి చల్లని నీటిని తాగడం వలన మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
*అతి చల్లని వాటర్ తాగిన వెంటనే మన జీర్ణక్రియ వ్యవస్థ నెమ్మదిస్తుంది. ఎందుకంటే చల్లని నీరు జీర్ణక్రియకు సంబంధించిన కండరాలలో కలిసి అవి సక్రమంగా పని చేయకుండా ఉంటాయి.
*ఫుల్ కూలింగ్ వాటర్ తాగడం వలన వెంటనే మనకు ముందుగా గొంతు నొప్పి వస్తుంది.
*జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు చల్లని నీటిని తాగితే అవి తొందరగా తగ్గవు ఇంకా అనారోగ్యం దెబ్బతింటుంది.
*ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని ఎక్కువకాలం నిలువ ఉంచకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ లోని కెమికల్స్ నీటిలో కలుస్తాయి. అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు.
*ఫ్రిడ్జ్ లోని చల్లని నీటిని స్పీడ్ గా తాగితే అది మనకు తలనొప్పిని కలిగించే ప్రమాదం ఉంది. ఎందుకంటే చల్లని నీరు వెంటనే రక్తనాళాల్లోనికి వెళ్లి అక్కడ నీరు వేగంగా ప్రవహించేలా చేసి తలనొప్పికి దారితీస్తుంది.
*ఫ్రిడ్జ్ లోని నీటిని ఎక్కువగా తాగడం వలన మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది.
*ఫ్రిడ్జ్ లోని చల్లని నీటిని తాగడం వలన మన దంతాలు సెన్సిటివ్ గా తయారవుతాయి.
* ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగడం వలన అది మన శరీరంలో కొవ్వును పెంచుతుంది. ఊబకాయం వచ్చేలా చేస్తుంది.
*చల్లని నీటిని తాగడం వలన మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
*ఫ్రిడ్జ్ లో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్ లోని చల్లని నీరు తాగడం వలన లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఫ్రిడ్జ్ లోని చల్లని నీళ్ళని తాగొద్దు. ముఖ్యంగా ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగొద్దు. ఎండాకాలంలో చల్లని నీళ్లు తాగాలనిపిస్తే కుండలో నీళ్లు తాగడం మంచిది.