Nail Arts : సరికొత్త నెయిల్ ఆర్ట్స్.. మీరు కూడా ట్రై చేయండి..
అందంగా కనబడడానికి మనం మన చేతి గోర్లకు నెయిల్ పాలిష్ లు, నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నెయిల్ ఆర్ట్స్ కూడా...........

Nail Arts : మనం ఎప్పుడైనా ఏ పనులు చేసినా కనిపించేవి మన చేతులు. అయితే అవి అందంగా కనబడడానికి మనం మన చేతి గోర్లకు నెయిల్ పాలిష్ లు, నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నెయిల్ ఆర్ట్స్ కూడా రకరకాలవి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఇప్పుడు ట్రెండ్ గా కొన్ని నెయిల్ ఆర్ట్స్ ఉన్నాయి. వాటిని వేసుకొని తమ నెయిల్స్ ఎంతో అందంగా మరియు అట్రాక్టివ్ గా కనబడేలా చేసుకుంటున్నారు.
ఇప్పుడు చాలా మంది క్రోమ్ నెయిల్స్ డిజైన్స్ ని వేసుకుంటున్నారు. క్రోమ్ నెయిల్స్ అంటే మన గోరు పైన ఖాళీగా ఉంచి ఓన్లీ గోరుకు చివర మాత్రమే డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ నే క్రోమ్ నెయిల్ డిజైన్ అంటారు. ఇంకొక ట్రెండ్ నెయిల్ ఆర్ట్.. మైక్రో నెయిల్ ఆర్ట్స్. మైక్రో నెయిల్ ఆర్ట్స్ అంటే గోర్లపై చిన్న చిన్న డిజైన్స్ వేస్తారు. ఇంకా న్యూట్రల్ కలర్స్ కూడా వాడుతుంటారు. మైక్రో నెయిల్ డిజైన్ కూడా చాలా మంది వేసుకుంటున్నారు.
సాధారణంగా నెయిల్ ఆర్ట్స్ లో పూలు, ముత్యాలు మాత్రమే కాకుండా వాటిలో డిఫరెంట్ గా ఉండే నెయిల్ ఆర్ట్ టార్టాయిస్, యానిమల్స్, పక్షులు.. ఇలా రకరకాల డిజైన్స్ ని నెయిల్ ఆర్ట్స్ గా వేస్తారు. గ్లాస్ నెయిల్ ఆర్ట్స్ అంటే ఈ డిజైన్స్ లో గాజు ముక్కలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఈ నెయిల్ ఆర్ట్ చాలా అట్రాక్టీవ్ గా కనిపిస్తుంది.
Eye Issues : ముప్ఫయ్ ఏళ్లకే కంటి సమస్యలు వస్తున్నాయా? ఇలా చేయండి..
హాఫ్ మూన్ నెయిల్ ఆర్ట్స్ కూడా ఒక రకమైన నెయిల్ ఆర్ట్. దీనిలో గోరుపై అన్ని రకాల రంగులు వేసుకొని గోరు చివరన హాఫ్ మూన్ షేప్ లో ఖాళీగా వదిలేస్తారు. ఇదే హాఫ్ మూన్ నెయిల్ ఆర్ట్. ఇవే కాకుండా అనేక రకాల డిజైన్స్ కూడా ఈ నెయిల్ ఆర్ట్స్ లో ఉన్నాయి. ఇలా ఇటీవలి కాలంలో రకరకాల నెయిల్ ఆర్ట్స్ ను వేసుకొని మగవాళ్ళు తమ చేతులని, గోర్లను అందంగా తయారుచేసుకుంటున్నారు. ఈ నెయిల్ ఆర్ట్స్ బయట బ్యూటీ పార్లర్ షాప్స్ లో వేస్తారు. లేదా ఈ డిజైన్స్ ని అమ్ముతారు కూడా.