Rakul Preet Singh : బాలీవుడ్ కి సపోర్ట్ గా రకుల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న సౌత్ నెటిజన్స్..

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఓ ప్రెస్ మీట్ లో సౌత్ సినిమాలు సక్సెస్, బాలీవుడ్ పరాజయం గురించి అడగగా రకుల్ సీరియస్ అయి.. ఇది చాలా చిన్న విషయం. మీరెందుకు పెద్దది చేస్తున్నారు.......................

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 06:56 AM

Rakul Preet Singh : బాలీవుడ్ కి సపోర్ట్ గా రకుల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న సౌత్ నెటిజన్స్..

Rakul Preet Singh :  కెరటం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రకుల్ తక్కువ సమయంలోనే వరుస సినిమాలు చేసి స్టార్ హీరోల సరసన కూడా మెప్పించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే బాలీవుడ్ కి చెక్కేసింది. ఇక అక్కడ వరుస ఆఫర్స్ ఉండటంతో అక్కడే సెటిల్ అయిపోయింది ఈ భామ.

బాలీవుడ్ లో రకుల్ కి హిట్స్ పాడకపోయినా వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. రకుల్ గత పది సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినా వరుస సినిమా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి బాలీవుడ్ లో. ఇటీవల గత సంవత్సర కాలంగా సౌత్ సినిమాలు భారీ సక్సెస్ అవ్వడం, బాలీవుడ్ సినిమాలు పరాజయం పాలవ్వడం, సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా హిట్ కొట్టడంతో సౌత్ సినిమా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో సౌత్ సినిమాలపై బాలీవుడ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది సౌత్ సినిమాలని అభినందిస్తుంటే కొంతమంది మాత్రం ఇప్పటికి విమర్శిస్తున్నారు.

Kajal Aggarwal : కాజల్ బ్యాక్ టు వర్క్.. ఒకేసారి ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టిందా??

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఓ ప్రెస్ మీట్ లో సౌత్ సినిమాలు సక్సెస్, బాలీవుడ్ పరాజయం గురించి అడగగా రకుల్ సీరియస్ అయి.. ఇది చాలా చిన్న విషయం. మీరెందుకు పెద్దది చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీన్ని ఓ పెద్ద ఇష్యూ చేస్తున్నారు. బాలీవుడ్, సౌత్ సినిమాలు అని వేరు వేరు చూడాల్సిన వసరం లేదు. రెండూ భారతీయ సినిమాలే. మంచి సినిమా వస్తే ఎక్కడైనా ఆడుతుంది. అన్ని చోట్ల ప్రతిభ గల టెక్నీషియన్స్ ఉన్నారు అని చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు మొత్తం బాలీవుడ్ కి సపోర్ట్ గానే ఉన్నాయని, సౌత్ సినిమాలని పొగడటానికి ఇష్టపడట్లేదు అని రకుల్ ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సౌత్ సినిమాల్లో సక్సెస్ సాధించి అక్కడికి వెళ్లిన రకుల్ ఇప్పుడు సౌత్ ని పొగడలేకపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.