Kajal Aggarwal : కాజల్ బ్యాక్ టు వర్క్.. ఒకేసారి ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టిందా??

పెళ్లి తర్వాత వెంటనే ప్రగ్నెంట్ కావడం, బాబు పుట్టడం.. దీంతో కాజల్ కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఈ క్రమంలో కాజల్ చేతిలో ఉన్న సినిమాలు కూడా వదిలేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా................

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 06:38 AM

Kajal Aggarwal : కాజల్ బ్యాక్ టు వర్క్.. ఒకేసారి ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టిందా??

Kajal Aggarwal :  చందమామ కాజల్ 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి త్వరలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది కాజల్. 2020లో కాజల్ అగర్వాల్ సడెన్ గా ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని అందర్నీ షాక్ కి గురిచేసింది.

పెళ్లి తర్వాత వెంటనే ప్రగ్నెంట్ కావడం, బాబు పుట్టడం.. దీంతో కాజల్ కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఈ క్రమంలో కాజల్ చేతిలో ఉన్న సినిమాలు కూడా వదిలేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా కాజల్ కి ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కాజల్ మళ్ళీ సినీ పరిశ్రమలోకి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

ఇప్పటికే కాజల్ నటించిన పారిస్ పారిస్ తమిళ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వనుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 లో కూడా కాజల్ అగర్వాల్ ఉన్నట్టు, ఇటీవల షూటింగ్ లో కూడా పాల్గొన్నట్టు సమాచారం. దీనిపై కాజల్ అధికారికంగా కూడా పోస్ట్ చేసింది. వీటితో పాటు కరుంగాపియం, ఘోస్టీ అనే మరో రెండు తమిళ సినిమాలు కూడా కాజల్ ఇటీవలే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో కూడా కాజల్ ని ఓ పాత్ర చేయమని సంప్రదించారట. దీనిపై ఇంకా కాజల్ సమాధానం ఇవ్వలేదు. కానీ తెలుగు సినిమా కాబట్టి ఓకే చెప్తుందని భావిస్తున్నారు.

Oscar 2023 RRR : ఆస్కార్ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించనున్న RRR.. నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్..

మొత్తానికి కాజల్ తన కంబ్యాక్ ని గ్రాండ్ గానే ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే అయిదు సినిమాలు చేతిలో ఉన్నాయంటే ఒక్క సినిమా రిలీజయినా ఇంకా ఆఫర్స్ రావడం గ్యారెంటీ. కాజల్ అగర్వాల్ సినిమాల్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తుండటంతో ఈ చందమామ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కాజల్ ని తెరపై చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.