Oscar 2023 RRR : ఆస్కార్ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించనున్న RRR.. నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్..
తాజాగా RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కూడా ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆస్కార్ నిర్వాహకులు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఈ పాటను.............

Oscar 2023 RRR : RRR సినిమా గత సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాలు సాధిస్తుందో చూస్తూనే ఉన్నాము. ఇన్నాళ్లు భారీ విజయం సాధించి, ప్రశంసలు అందుకొని, కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇప్పుడు అవార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది RRR సినిమా. నాటు నాటు సాంగ్ అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకొని ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో ఈ సాంగ్ ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్ ముంగిట నిలిచింది. సాధారణంగా ఆస్కార్ కి నామినేట్ అయిన బెస్ట్ సాంగ్స్ ని లైవ్ పర్ఫార్మెన్స్ చేయిస్తారు. అయిదు పాటలు నామినేట్ అవ్వగా ఇప్పటికే రెండు పాటలు ఆస్కార్ వేడుకల రోజు లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్టు ఆస్కార్ కమిటీ ప్రకటించింది.
తాజాగా RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కూడా ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆస్కార్ నిర్వాహకులు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఈ పాటను ఆస్కార్ వేదికపై పాడనున్నారు. దీంతో మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆస్కార్ వేదికపై మన తెలుగు పాట, మన తెలుగు సింగర్స్ తో పర్ఫార్మ్ కానుంది. ఈ పాటకు కీరవాణి కూడా లైవ్ లో సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది.
HCA Awards tweet to NTR fans..
అలాగే ఇటీవల చరణ్ ని ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో.. నాటు నాటు డ్యాన్స్ ఆస్కార్ వేదికపై వేస్తారా అని అడిగితే చరణ్.. వాళ్ళు మమ్మల్ని ఈ విషయంలో సంప్రదిస్తే కచ్చితంగా వేస్తాము. అది మాకు గౌరవం లాంటిది అని అన్నారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆస్కార్ వేదికపై నాటు నాటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars.
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs
— The Academy (@TheAcademy) February 28, 2023