ఇటీవల HCA అవార్డ్స్‌లో RRR మూవీ.. 5 అవార్డులు గెలుచుకుంది.

కాగా ఆహ్వానం అందడంతో ఈ అవార్డ్స్‌కి రామ్‌చరణ్‌ హాజరయిన విషయం తెలిసిందే. 

అయితే ఎన్టీఆర్ వెళ్లకపోవడంతో, ఎన్టీఆర్‌ని ఎందుకు ఆహ్వానించ లేదు అంటూ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో HCA ని ప్రశ్నించారు.

దీనికి HCA బదులిస్తూ.. మేము ఆహ్వానించాము కానీ..

ఎన్టీఆర్ బ్రదర్ చనిపోవడం, తన కొత్త సినిమా వర్క్స్ వల్ల అతను రాలేదు అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని బాధపడకండి అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

ఎన్టీఆర్‌కి కూడా ఒక అవార్డు ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్స్‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.