Kajal Aggarwal : నా కొడుక్కి నేను నటించిన వాటిల్లో ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తాను..

ప్రస్తుతం కాజల్ ఓ పక్క సినిమా షూటింగ్స్ కి వెళుతూ మరోపక్క తన బాబు నీల్ కిచ్లూతో సరదాగా లైఫ్ ని ఆస్వాదిస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. తన బాబుకి..............

Kaburulu

Kaburulu Desk

March 8, 2023 | 08:09 PM

Kajal Aggarwal : నా కొడుక్కి నేను నటించిన వాటిల్లో ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తాను..

Kajal Aggarwal :  2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి త్వరలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది కాజల్. 2020లో కాజల్ అగర్వాల్ సడెన్ గా బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకొని అందర్నీ షాక్ కి గురిచేసింది. పెళ్లి తర్వాత వెంటనే ప్రగ్నెంట్ కావడం, బాబు పుట్టడం.. దీంతో కాజల్ కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ కంబ్యాక్ ఇవ్వబోతుంది.

ప్రస్తుతం కాజల్ ఓ పక్క సినిమా షూటింగ్స్ కి వెళుతూ మరోపక్క తన బాబు నీల్ కిచ్లూతో సరదాగా లైఫ్ ని ఆస్వాదిస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. తన బాబుకి 8 ఏళ్ళు వచ్చేవరకు ఎలాంటి ఎలక్ట్రానికి గ్యాడ్జెట్స్ ఇవ్వనని, అలాంటి వాటికి దూరంగా ఉంచుతానని తెలిపింది. దీంతో చిన్నపిల్లలకు ఫోన్లు, టీవీలు దూరంగా ఉంచాలి అంటూ కాజల్ ని అభినందిస్తున్నారు. ఈ విషయంలో కాజల్ ని చూసి అందరూ నేర్చుకోవాలి అని అంటున్నారు.

Raashii Khanna : బాహుబలి ఆడిషన్ కి వెళ్తే.. అందం ఎక్కువందని రాజమౌళి రిజెక్ట్ చేశారు..

ఇక కాజల్ నటించిన సినిమాలు బాబుకి చూపిస్తారా అని అడిగితే చూపిస్తాను అవి కూడా 8 ఏళ్ళు వచ్చిన తర్వాతే చూపిస్తాను. నా సినిమాల్లో మా అబ్బాయికి మొదట తుపాకీ సినిమా చూపిస్తాను అని తెలిపింది. తమిళ్ లో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన తుపాకీ సినిమా భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమానే ఎందుకు చూపిస్తుందో మాత్రం కాజల్ చెప్పలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.