Anchor Lasya : మరో మగబిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య..
ఇటీవల కొన్ని నెలల క్రితం తాను మళ్ళీ తల్లి కాబోతున్నాను అని తెలిపింది లాస్య. అలాగే మరికొన్ని రోజుల తర్వాత తన శ్రీమంతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా నేడు హోలీ రోజు..............

Anchor Lasya : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత నటిగా కూడా పలు సినిమాలు చేసింది యాంకర్ లాస్య. కానీ ప్రేమించి పెళ్లి చేసుకొని యాంకరింగ్ కి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి కొన్ని రోజులు దూరమైంది. పెళ్లి , ఒక బాబు తర్వాత మళ్ళీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అయితే కేవలం పలు టీవీ షోలలో గెస్ట్ గా కనిపిస్తుంది లాస్య. ఇక సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మాత్రం రెగ్యులర్ గా చాలా యాక్టివ్ గా ఉంటుంది లాస్య.
Raashii Khanna : బాహుబలి ఆడిషన్ కి వెళ్తే.. అందం ఎక్కువందని రాజమౌళి రిజెక్ట్ చేశారు..
ఇటీవల కొన్ని నెలల క్రితం తాను మళ్ళీ తల్లి కాబోతున్నాను అని తెలిపింది లాస్య. అలాగే మరికొన్ని రోజుల తర్వాత తన శ్రీమంతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా నేడు హోలీ రోజు తనకు బాబు పుట్టినట్టు ప్రకటించింది లాస్య. తన భర్త, లాస్య, పెద్ద కొడుకు ముగ్గురు చేతులకు రంగులు పూసుకొని ఒక్కొక్క చెయ్యి తీస్తూ ఇప్పుడు పుట్టిన కొడుకు చెయ్యి చూపించి తనకి కొడుకు పుట్టినట్టు ప్రకటిస్తూ ఓ వీడియో చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లాస్య. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లాస్యకి కంగ్రాట్స్ చెప్తున్నారు.