Anchor Lasya : యాంకర్ లాస్య.. రెండోసారి తల్లి కాబోతుందంటూ ఎమోషనల్ పోస్ట్..

Anchor Lasya : రవితో కలిసి పలు షోలకి యాంకర్ గా చేసి పాపులారిటీ తెచ్చుకుంది యాంకర్ లాస్య. షోలు, సినిమాల, ఈవెంట్స్ తో మంచి పేరు తెచ్చుకుంది యాంకర్ లాస్య. మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు పరిశ్రమకి దూరమైంది. తనకి ఒక బాబు పుట్టాక మళ్ళీ వెలుగులోకి వచ్చింది లాస్య. ఆ తర్వాత సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, పలు షోలలో కనిపిస్తూ లాస్య ఇదివరకులా యాక్టీవ్ గా ఉంటుంది.
తన భర్త మంజునాథ్, తన కొడుకు జున్నుని కూడా అప్పుడప్పుడు షోలకి తీసుకొస్తూ పాపులర్ చేసేసింది. వాళ్ళని కూడా సోషల్ మీడియాలో ఫేమస్ చేసేసింది లాస్య. తాజాగా తాను రెండోసారి తల్లిని కాబోతున్నట్టు ప్రకటించింది.
Comedian Soori : స్టార్ కమెడియన్ హోటల్స్ పై ఐటీ దాడులు..
తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నేను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు మా ఫ్యామిలీ మరింత పెద్దదవుతుంది అని పోస్ట్ చేసింది. దీంతో లాస్య అభిమానులు, పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.