NBK108 : NBK108లో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్?

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బాక్ విజయాల్ని అందుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టేందుకు తన తదుపరి సినిమాని సిద్ధం చేస్తున్నాడు. NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమా..

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 08:19 PM

NBK108 : NBK108లో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్?

NBK108 : నందమూరి బాలకృష్ణ ఈ ఏడాదిని అదిరిపోయే హిట్టుతో మొదలుపెట్టాడు. ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నాడు. మలినేని గోపిచంద్ ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ మరియు ఫ్యాక్షన్ డ్రామాతో తెరకెక్కించిన తీరు అన్ని వర్గాల అభిమానులను అలరించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా సాధించినట్లు తెలుస్తుంది. అలాగే ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం 1M గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది.

Balakrishna : ఫ్లోలో అన్న మాటలని వివాదం చేశారు.. ఏఎన్నార్ నాకు బాబాయ్..

ఇక అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బాక్ విజయాల్ని అందుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టేందుకు తన తదుపరి సినిమాని సిద్ధం చేస్తున్నాడు. NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్యకి జంటగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ని కన్‌ఫార్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కాజల్.. అగ్రహీరోలు అయిన చిరు, కమల్ పక్కన చేస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

కాగా ఇటీవల వీరసింహారెడ్డిలో నటించిన హనీ రోజ్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ రెండిటిలో ఏది నిజం అనేది తెలియదు. ఒకవేళ ఇద్దరు ఈ సినిమాలో నటించబోతున్నారా? అనే డౌట్ కూడా వినిపిస్తుంది. దీని పై క్లారిటీ రావాలి అంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లు దర్శకుడు తెలియజేశాడు. థమన్ మరోసారి బాలయ్య సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.