Waltair Veerayya Review : పండక్కి బాస్, మాస్ కలిసి కుమ్మేశారు.. వింటేజ్ కామెడీ యాక్షన్ తో బాస్ ఈజ్ బ్యాక్..

నిమా మొదటి నుంచి కూడా వింటేజ్ చిరంజీవిని చూపించారు. చిరంజీవి పాత సినిమాల్లో కామెడీ ఎలా ఉండేదో దాన్ని మెయింటైన్ చేశాడు. ఓ పక్క కామెడీ చూపిస్తూనే బాస్ కి మాస్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. చిరు, రవితేజ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి.......................

Kaburulu

Kaburulu Desk

January 13, 2023 | 12:33 PM

Waltair Veerayya Review : పండక్కి బాస్, మాస్ కలిసి కుమ్మేశారు.. వింటేజ్ కామెడీ యాక్షన్ తో బాస్ ఈజ్ బ్యాక్..

Waltair Veerayya Review :  చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ, క్యాథరీన్ త్రెసా, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే సినిమా చూసిన వాళ్లంతా వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిరంజీవి, రవితేజ కలిసి రఫ్ఫాడించేశారు అని చెప్తున్నారు. అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా మెప్పిస్తుంది.

 

కథ విషయానికి వస్తే.. ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ (బాబీ సింహా)ని అనుకోకుండా ఒక పల్లెటూరి స్టేషన్ లో ఒక రాత్రి ఉంచాల్సి వస్తుంది. కానీ ఆ క్రిమినల్ తన మనుషులతో కలిసి ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులందరని చంపేసి తప్పించుకుంటాడు. దీంతో ఆ స్టేషన్ హెడ్ (రాజేంద్రప్రసాద్) జాబ్ పోవడం, తన తోటి పోలీసులని చంపేశాడన్న కోపంతో ఆ క్రిమినల్ ని ఎలాగైనా పట్టుకోవాలని లోకల్ రౌడీ అయిన వాల్తేరు వీరయ్య(చిరంజీవి) సహాయం కోసం వస్తాడు. డబ్బులకోసం చిరంజీవి ఈ పనిని ఒప్పుకొని ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి మలేషియా వెళ్తారు. అక్కడ మలేషియాలో శృతి హాసన్ తగలడం, శృతితో చిరు రొమాన్స్, పక్కన ఉన్న కమెడియన్స్ కామెడీతో సాగిపోతుంటే శృతి హాసన్ ఓ ట్విస్ట్ ఇస్తుంది. ఇక బాబీ సింహానే చిరంజీవి గ్యాంగ్ ని పట్టుకునే సమయానికి చిరంజీవి ఓ ట్విస్ట్ ఇచ్చి బాబీ సింహాని చంపేస్తాడు. ఇంటర్వెల్ కి వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది.

ఇంటర్వెల్ నుంచి శృతి, రాజేంద్రప్రసాద్ లకు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు చిరు. ఇంటర్వెల్ తర్వాత రవితేజ ఎంట్రీతో సినిమా ఓపెన్ అవుతుంది. వైజాగ్ లో సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్లకి లీడర్ అయిన వాల్తేరు వీరయ్య, అతని చుట్టూ ఉండే బ్యాచ్ కామెడీ, అక్కడికి పోలీసాఫీసర్ గా వచ్చిన రవితేజ, వాళ్ళ మధ్య గొడవలు, కామెడీ, క్యాథరిన్ ఎంట్రీతో.. ఇలా కామెడీ, మాస్ ఎలిమెంట్స్ తో సాగిపోతుంది. కొంతమంది పిల్లల ప్రాణాలు పోవడంతో మంచోడిగా నటించే విలన్ నిజస్వరూపం బయటపడుతుంది. ఆ నేరం చిరంజీవి మీదకి వస్తే అప్పుడు చిరంజీవి, రవితేజ ఏం చేశారు? అసలు చిరంజీవి మలేషియాకు ఎందుకు వెళ్ళాడు. చిరంజీవికి, రవితేజకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? క్యాథరీన్ చిరంజీవికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు చిరంజీవి ఆ మోసం చేసిన వ్యక్తి (విలన్)ని పట్టుకున్నాడా? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా మొదటి నుంచి కూడా వింటేజ్ చిరంజీవిని చూపించారు. చిరంజీవి పాత సినిమాల్లో కామెడీ ఎలా ఉండేదో దాన్ని మెయింటైన్ చేశాడు. ఓ పక్క కామెడీ చూపిస్తూనే బాస్ కి మాస్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. చిరు, రవితేజ సన్నివేశాలు అన్నీ బాగుంటాయి. వాళ్ళ ఫైట్స్, కామెడీ, డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులకి, ప్రేక్షకులకి నచ్చుతాయి. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ తో ప్రేక్షకులని ఏడిపిస్తారు. సినిమాలో ఉండే కొన్ని ట్విస్టులు ఆశ్చర్యపరుస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం అదిరిపోతుంది. శృతి హాసన్ తో చిరు ఫైట్ బాగుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్నిటిని కామెడీకి బాగా వాడుకున్నారు. దర్శకుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ కావడం, రవితేజ తనకి లైఫ్ ఇవ్వడంతో ఇద్దరి హీరోల్ని చాలా చక్కగా డీల్ చేశాడు. ఇద్దరికీ మంచి ఎలివేషన్స్, మంచి సీన్స్ పడటంతో థియేటర్స్ అభిమానుల కేరింతలతో మారుమ్రోగుతున్నాయి. శృతి, క్యాథరీన్ ఇద్దరూ కూడా వారి పాత్రల్లో చక్కగా మెప్పించారు. రాజేంద్రప్రసాద్ మళ్ళీ కామెడీ కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్ తో మెప్పించారు.

Veerasimha Reddy Review : యాక్షన్ ఎలివేషన్స్‌తో పాటు సెంటిమెంట్‌ని పండించిన వీరసింహారెడ్డి.. స్క్రీన్‌పై బాలయ్య ఊచకోత..

మొత్తానికి పండక్కి అభిమానులు, ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యేలా చిరంజీవి, రవితేజ కలిసి అలరిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి తన వింటేజ్ మాస్ లుక్, కామెడీ, యాక్షన్ తో కనపడటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో వచ్చి హిట్ కొట్టేశారు. దీంతో వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు.