Veerasimha Reddy Review : యాక్షన్ ఎలివేషన్స్‌తో పాటు సెంటిమెంట్‌ని పండించిన వీరసింహారెడ్డి.. స్క్రీన్‌పై బాలయ్య ఊచకోత..

బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరెక్కిన సినిమా వీరసింహారెడ్డి. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా.................

Kaburulu

Kaburulu Desk

January 12, 2023 | 02:09 PM

Veerasimha Reddy Review : యాక్షన్ ఎలివేషన్స్‌తో పాటు సెంటిమెంట్‌ని పండించిన వీరసింహారెడ్డి.. స్క్రీన్‌పై బాలయ్య ఊచకోత..

Veerasimha Reddy Review :  బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరెక్కిన సినిమా వీరసింహారెడ్డి. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక కథ విషయానికి వస్తే టర్కీలో హానిరోజ్ తల్లిగా, బాలకృష్ణ కొడుకుగా ఓపెన్ అవుతుంది. ఒక ఫైట్, శృతి హాసన్ తో లవ్ ట్రాక్, ఓ పాట ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ కర్నూలులో వీరసింహారెడ్డి (తండ్రిగా ఇంకో బాలకృష్ణ) ఊరికి దేవుడిలా చూపిస్తారు. ఇక్కడ కూడా ఫైట్స్, ఎలివేషన్స్ తో సాగిపోతుంది. అసలు కొడుకు, హాని రోజ్ ఉన్నారనే తెలియక బతుకుతున్న వీరసింహారెడ్డికి టర్కీ నుంచి ఫోన్ వచ్చి కొడుకు పెళ్లి గురించి తండ్రి స్థానంలో మాట్లాడటానికి రావాలి అనడంతో టర్కీ వెళ్తాడు వీరసింహారెడ్డి. ఇదే అదను చూసి విలన్స్ టర్కీ వెళ్లి ఒంటరిగా దొరికిన బాలకృష్ణ(వీరసింహారెడ్డి)ని చంపేస్తారు. అయితే చంపే సమయంలో ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తాడు. ఇక ఇంటర్వెల్ తర్వాత కొడుకు బాలకృష్ణ తల్లితో కలిసి రాయలసీమ వెళ్లి తన తండ్రి ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుంటాడు. తన తండ్రి చనిపోవడంతో తన తండ్రి స్థానాన్ని తను తీసుకొని విలన్స్ ని చంపేస్తాడు. చివర్లో మరో ట్విస్ట్ హైలెట్ ఉంటుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఓ ట్విస్ట్ ఉంటుంది.

మొత్తంగా చూస్తే యాక్షన్, ఎలివేషన్స్ సీన్స్ మాత్రం థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తాయి. అభిమానులు పండగ చేసుకుంటారు. బాలయ్యని మరింత రాజసంగా చూపించారు వీరసింహారెడ్డిగా. ఇక సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి. అసలు బాలయ్య సినిమాలో ట్విస్టులు పెట్టడం గ్రేట్. అలాంటిది ఒక మూడు ట్విస్టులు వరకు పెట్టి కథపై ఆసక్తి కలిగించాడు దర్శకుడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోవడంతో సెకండ్ హాఫ్ ఎక్కువ సేపు ఉన్నట్టు ఉంటుంది, డ్రామా, సెంటిమెంట్ ఉండటంతో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది.

బాలకృష్ణ తన గత సినిమాల లాగే అదరగొట్టే యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవాల్సింది వరలక్ష్మి శరత్ కుమార్ గురించి. ఇటీవల నెగిటివ్ పాత్రలతో మెప్పిస్తున్న వరలక్ష్మి ఇందులో పాజిటివ్, నెగిటివ్ పాత్రలతో అదరగొడుతుంది. తన యాక్టింగ్ తో మరోసారి సూపర్ అనిపించుకుంటుంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా బాలయ్యకి దీటుగా నిలబడ్డాడు. నవీన్ చంద్ర కొద్దిసేపు కనిపించినా కథ మలుపు తిప్పే పాత్రలో కనపడి అలరించాడు. గతంలో క్రాక్ సినిమాలో లాగే ఇందులో కూడా డైరెక్టర్ గోపీచంద్ తనయుడు మంచి రోల్ పోషించి తన యాక్టింగ్ తో మెప్పించాడు.

Breaking : Golden Globe Award :  అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న RRR..

ఇక సినిమాలో ఉన్న డైలాగ్స్ లో చాలా వరకు జగన్ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా కౌంటర్లు లాగే ఉన్నాయి. ఏపీలో ఉన్న పరిస్థితులని ఉద్దేశించి డైలాగ్స్ కౌంటర్లులా పేలాయి. ఇవి కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో చర్చకి వస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ BGM. బాలయ్య గత సినిమా అఖండకి భారీ మ్యూజిక్ ఇచ్చి చెవులు దద్దరిల్లేలా చేశాడు. ఈ సినిమాలో కూడా తన మాస్ BGM తో పాటు సెంటిమెంట్, సాంగ్స్ కి మ్యూజిక్ తో మరోసారి మెప్పించాడు. డైరెక్టర్ గోపీచంద్ టేకింగ్ బాగుంది. మాస్ ఎలివేషన్స్ సీన్స్ లో బోయపాటిని మించి బాలయ్యకి ఎలివేషన్స్ ఇచ్చాడు.

ఓవరాల్ గా వీరసింహారెడ్డి అభిమానుల సినిమా, బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా. మాములు ఆడియన్స్ కి ఒక యావరేజ్ సినిమాలాగా అనిపిస్తుంది.