Breaking : Golden Globe Award :  అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న RRR..

హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఉదయం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి..............

Kaburulu

Kaburulu Desk

January 11, 2023 | 09:42 AM

Breaking : Golden Globe Award :  అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న RRR..

Golden Globe Award :  రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా RRR ప్రపంచమంతటా భారీ విజయం సదహించి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకా విదేశాల్లో కూడా సినీ ప్రియులకి తెగ నచ్చేసింది. హాలీవుడ్ లో అయితే RRR సినిమాని, దర్శకుడు రాజమౌళిని అందరూ పొగిడేశారు. ఇప్పటికే పలు హాలీవుడ్ అవార్డులు సాధించిన RRR సినిమా తాజాగా మరో భారీ అవార్డు అందుకుంది.

హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఉదయం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు సాధించింది. ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించిన కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. ఇంత ప్రతిష్టాత్మక అవార్డుని అందుకోవడంతో కీరవాణికి, RRR చిత్రయూనిట్ కి దేశవ్యాప్తంగా నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు   అభినందనలు తెలియచేస్తున్నారు.

Raghu Rama Krishna Raju : చిరు, బాలయ్య ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటున్న వైసీపీ ఎంపీ..

మొదటి సారి AR రెహమాన్ స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని మొదటి ఇండియన్ గా నిలవగా ఇప్పుడు నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న భారత రెండో వ్యక్తిగా కీరవాణి చరిత్ర స్రృష్టించాడు. ఈ వేడుకలో అవార్డు తీసుకున్న కీరవాణి వేదికపై మాట్లాడుతూ.. అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, తన భార్యకి, రాజమౌళికి, ఈ పాటకి డ్యాన్స్ సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి, సాహిత్యం అందించిన చంద్రబోస్ గారికి, పాట పడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకి, అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి అలాగే ఈ సాంగ్ కి ప్రోగ్రామింగ్ చేసిన సాలు సిద్దార్థ్, జీవన్ బాబులకి ధన్యవాదాలు తెలిపాడు.